ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) :
ధాన్యం కొనుగోలు అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) దృష్టి సారించారు. ధాన్యం కొనుగోలు, పలుప్రాంతాల్లో నీటి సరఫరా ఇబ్బందులు తన దృష్టికి రావడంతో ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. కృత్రిమ నీటి కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. ఉద్దేశ్యపూర్వకంగా గేటెడ్ కమ్యూనిటీలకు ఎక్కువ నీరు, బస్తీలకు తక్కువ నీటిని విడుదల చేసే సిబ్బందిపై నిఘా పెట్టాలన్నారు. అలాగే ధాన్యం కొనుగోలులో తరుగు తీస్తే వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ధాన్యం పక్కదారి పట్టించే మిల్లర్లపై నిఘా పెట్టాలన్నారు. కనీస మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేయవద్దని ఆదేశాలు జారీ చేశారు.
ఇది చదవండి : వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మారేపల్లి సుధీర్ కుమార్..
ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… రైతులు అమ్ముకునే ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్లు, ట్రేడర్ల ట్రేడ్ లైసెన్స్ రద్దు చేయాలన్నారు. వారికి కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని ఆదేశించారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు తమ పరిధిలోని మార్కెట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు సజావుగా సాగేలా చూడాలన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: ధాన్యం కొనుగోలు పై రేవంత్ రెడ్డి దృష్టి..