ఆస్ట్రేలియా(Australia) రాజధాని సిడ్నీ(Sydney)లోని ఓ షాపింగ్ మాల్(Shopping Mall)లో కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందినట్లు, పలువురు గాయపడ్డట్టు సమాచారం. సిడ్నీలోని బోండీ జంక్షన్ పరిధిలో గల వెస్ట్‌ఫీల్డ్ మాల్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో 10మంది చనిపోయినట్లు వెల్లడించారు అలాగే ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని పోలీసులు మట్టుబెట్టినట్లు ‘సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్’ స్పష్టం చేసింది.
ఇది చదవండి: మొజాంబిక్ తీరంలో తీవ్ర విషాదం..!
కాగా, ఈ ఘటనతో షాపింగ్ మాల్‌లో ఉన్న వందల సంఖ్యలో జనం ఒక్కసారిగా పరుగులు తీసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. దాంతో పరిస్థితి భయానకంగా మారడంతో మాల్‌కు వచ్చిన కస్టమర్లను పోలీసులు అక్కడి నుంచి తరలించారు. గాయపడిన వారిని అంబులెన్సులలో సమీపంలోని ఆసుపత్రులకు తీసుకెళ్లారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.