బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavita) :
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavita)కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam)లో కవిత సీబీఐ కస్టడీని రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు పొడిగించింది. మరో 9 రోజుల పాటు కవిత కస్టడీని పొడిగించింది. 15 రోజుల పాటు కస్టడీని పొడిగించాలని కోర్టును సీబీఐ కోరింది. అయితే 9 రోజుల పాటు కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో ఈనెల 23 వరకు ఆమె సీబీఐ కస్టడీలో ఉండనున్నారు. మూడు రోజుల కవిత కస్టడీ ముగియడంతో ఆమెను సీబీఐ అధికారులు ఈవాళ కోర్టులో హాజరు పరిచారు.
ఇది చదవండి : కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత ఇంటి వద్ద ఉద్రిక్తత..!
కోర్టులో విచారణ సందర్భంగా… సాక్ష్యాలను కవిత ముందు ఉంచి ప్రశ్నించామని… ఆమె విచారణకు సహకరించలేదని కోర్టుకు సీబీఐ తెలిపింది. ఆమెను విచారించేందుకు మరింత సమయం కావాలని కోరింది. ఈ నేపథ్యంలో కవిత సీబీఐ కస్టడీని కోర్టు పొడిగించింది. మూడు రోజుల కస్టడీలో కేసులోని నిందితులు, అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలం, వాట్సాప్ చాట్ పై కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. కవిత విచారణను సీబీఐ వీడియో రికార్డింగ్ చేసింది. లిక్కర్ స్కామ్ లో మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. తీహార్ జైల్లో ఉన్న సమయంలోనే ఆమెను సీబీఐ అదుపులోకి తీసుకుంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News