ఖాళీగా ఉన్న మెడికల్ పీజీ సీట్ల భర్తీకి కర్ణాటక, మహారాష్ట్రాల్లో ఇచ్చినట్లు సడలింపు ఇవ్వాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని మెడికల్ కాలేజీల యాజమాన్యాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. పిటిషన్‌పై జస్టిస్ పీఎస్ నర్సింహ, జస్టిస్ అలోక్ అరాథే ధర్మాసనం విచారణ చెపట్టింది. ఫిబ్రవరి 28వ తేదీతో కౌన్సెలింగ్ ముగిసిందని అప్పటికి ఎపీలో 246 సీట్లు, తెలంగాణలో 377 పీజీ సీట్లు భర్తీ కాలేదని న్యాయస్థానానికి కాలేజీ యాజమాన్యాలు వివరించాయి. ఏపీలో సుమారు 45 కన్వీనర్ కోటా సీట్లు కూడా ఉన్నాయని తెలిపారు.
కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు సిద్ధంగా ఉన్నారని, గడువు ముగియడంతో కౌన్సెలింగ్ ముగించారని యాజమాన్యాలు ప్రస్తావించాయి. జాతీయ మెడికల్ కమిషన్‌కి సంబంధిత యూనివర్సిటీలు, కాలేజీలు గడువుకు విజ్ఞప్తి చేశాయని పిటిషన్లో పేర్కొన్నాయి. అయితే, యాజమాన్యాలు విజ్ఞప్తి చేసినా ఎలాంటి సమాధానం రాలేదని పిటిషనర్ తరపు అడ్వకేట్లు వాదనలు వినిపించారు. మెడికల్ కాలేజీ యాజమన్యాలు దాఖలు చేసిన పిటిషన్‌పై సమాధానం చెప్పాలని ధర్మాసనం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. కేసు పూర్తి స్థాయి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.
court
తిరుమల లడ్డూ వ్యవహారంలో దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఈ వ్యవహారంపై కామెంట్లు చేయకుండా నిలువరించాలని..మానూరు శ్రీనివాస్ పిటిషన్ వేశారు. ఈ కామెంట్లపై సీబీఐ ఎలాంటి దర్యాప్తు జరపలేదని పేర్కొన్నారు. అయితే.. దర్యాప్తు పెండింగ్‌లో ఉన్నప్పుడు జోక్యం చేసుకోలేమని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం స్పష్టం చేస్తూ పిటిషన్ కొట్టివేసింది. అన్ని అంశాలు పరిశీలించాకే సీబీఐతో సిట్ వేయించామని పేర్కొంది. ఏదైనా ఉంటే సీబీఐ ముందే చెప్పుకోవాలని సూచించింది. తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్. తిరుమల లడ్డూ వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేశారు. అన్ని అంశాలు పరిశీలించాకే సీబీఐతో సిట్ వేయించామన్న సుప్రీంకోర్టు.. ఏదైనా ఉంటే సీబీఐ ముందే చెప్పుకోవాలని సూచించారు. మానూరు శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది ధర్మాసనం.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు దర్యాప్తు ప్రక్రియ ముగిసిందని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. ధర్మాసనం ఈ కేసుపై స్పందిస్తూ, విచారణను వేగవంతం చేయాలని ట్రయల్ కోర్టుకు స్పష్టమైన గడువు విధించింది. సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా సీబీఐ తరఫు న్యాయవాది కీలక ప్రకటన చేశారు. ఈ కేసులో ఇప్పటికే మూడవ సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను దాఖలు చేశామని, దీంతో తమ వైపు నుంచి దర్యాప్తు ప్రక్రియ పూర్తయిందని న్యాయస్థానానికి వివరించారు. దర్యాప్తు ముగిసిన నేపథ్యంలో, నిందితుల బెయిల్ రద్దు చేయాలని కోరుతూ గతంలో సీబీఐ, వివేకా కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ అవసరం లేదని భావించిన ధర్మాసనం, వాటిని డిస్మిస్ చేసింది.అయితే, తాము లేవనెత్తిన కొన్ని కీలక అంశాలపై సీబీఐ సరైన దర్యాప్తు చేయలేదని సునీత తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ధర్మాసనం… కేసులోని అంశాలు లేదా ఆధారాలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే నేరుగా ట్రయల్ కోర్టునే ఆశ్రయించాలని సూచించింది. సెక్షన్ 207 కింద ట్రయల్ కోర్టులో దాఖలైన అన్ని పిటిషన్లను పరిశీలించి, విచారణను పూర్తి చేయాలని ఆదేశించింది.
ఈ కేసులో జాప్యాన్ని నివారించేందుకు సుప్రీంకోర్టు ఒక కీలక కాలపరిమితిని విధించింది. ట్రయల్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న అన్ని పిటిషన్లపై నాలుగు వారాల్లోగా విచారణ ముగించి, తగిన తీర్పు వెలువరించాలని ఆదేశించింది. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ ఒక నెల గడువుతో, వివేకా హత్య కేసులో రాబోయే 30 రోజులు అత్యంత కీలకం కానున్నాయి. ప్రధాన నిందితులు, కుట్రదారుల విషయంలో ట్రయల్ కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికరంగా మారింది.
రిమాండ్ (Remand) :
సీఎం జగన్‌పై రాయితో దాడి కేసులో నిందితుడు సతీశ్‌కు కోర్టు 14 రోజలు పాటు రిమాండ్ (Remand) విధించింది. విజయవాడ సింగ్ నగర్లో బస్సు యాత్ర నిర్వహిస్తున్న సమయంలో సీఎం జగన్‌పై రాయితో దాడి జరిగింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు విచారణ జరిపి నిందితుడు సతీశ్‌ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు నిందితుడు సతీశ్‌కు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అయితే నిందితుడు సతీశ్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు పలు కీలక విషయాలు వెల్లడించారు. సీఎం జగన్ పై నిందితుడు రెండు సార్లు రాయి విసిరినట్లు తెలిపారు. ఒక సారి మిస్ కావడంతో మరోసారి తగిలినట్లు పేర్కొన్నారు. సీఎం జగన్‌పై దాడి చేయమని నిందితుడు సతీశ్‌కు దుర్గారావు అనే వ్యక్తి చెప్పినట్లు చెప్పారు. దాడి తర్వాత దుర్గారావుకు నిందితుడు సతీశ్ ఫోన్ చేశారని, మరోసారి చేస్తే స్విచ్చాఫ్ వచ్చిందని రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్ధ రెడ్డిపై కేసు నమోదు..వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై కర్నూలులో కేసు నమోదైంది. మంత్రి టీజీ భరత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు పోలీసులు. మే 14న కర్నూలు కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో పాల్గొన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి..మంత్రి టీజీ…
- జీగిరాం జ్యూట్ ఫ్యాక్టరీ మూతతో కార్మికుల జీవితం ఛిద్రం ..పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు జీగిరాంలో ఒకప్పుడు వేలాది కుటుంబాలకు జీవనాధారంగా నిలిచిన జ్యూట్ ఫ్యాక్టరీ నేడు మూతపడిన గేట్లతో కార్మికుల కన్నీటి గాథగా మారింది. 1986 డిసెంబర్ 9న అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చేతుల మీదుగా ప్రారంభమైన ఈ…
- ఆకివీడు రామాలయం వివాదంపై స్పందించిన డిప్యూటీ స్పీకర్..పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు శ్రీరామాలయం నిర్మాణ వివాదంపై డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆలయ నిర్మాణంపై కోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు ఇవ్వడంపై ఆయన స్పందించారు. కాళ్ల మండలం పెదఅమిరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: జగన్‌పై దాడి కేసులో నిందితుడికి 14 రోజల రిమాండ్…
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavita) :
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavita)కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam)లో కవిత సీబీఐ కస్టడీని రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు పొడిగించింది. మరో 9 రోజుల పాటు కవిత కస్టడీని పొడిగించింది. 15 రోజుల పాటు కస్టడీని పొడిగించాలని కోర్టును సీబీఐ కోరింది. అయితే 9 రోజుల పాటు కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో ఈనెల 23 వరకు ఆమె సీబీఐ కస్టడీలో ఉండనున్నారు. మూడు రోజుల కవిత కస్టడీ ముగియడంతో ఆమెను సీబీఐ అధికారులు ఈవాళ కోర్టులో హాజరు పరిచారు.
ఇది చదవండి : కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత ఇంటి వద్ద ఉద్రిక్తత..!
కోర్టులో విచారణ సందర్భంగా… సాక్ష్యాలను కవిత ముందు ఉంచి ప్రశ్నించామని… ఆమె విచారణకు సహకరించలేదని కోర్టుకు సీబీఐ తెలిపింది. ఆమెను విచారించేందుకు మరింత సమయం కావాలని కోరింది. ఈ నేపథ్యంలో కవిత సీబీఐ కస్టడీని కోర్టు పొడిగించింది. మూడు రోజుల కస్టడీలో కేసులోని నిందితులు, అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలం, వాట్సాప్ చాట్ పై కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. కవిత విచారణను సీబీఐ వీడియో రికార్డింగ్ చేసింది. లిక్కర్ స్కామ్ లో మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. తీహార్ జైల్లో ఉన్న సమయంలోనే ఆమెను సీబీఐ అదుపులోకి తీసుకుంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News





Total views : 81439