101
కడప జిల్లా ఒంటి మిట్ట కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించాడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపటి నుంచి ఈ నెల 26 వ తేదీ వరకూ జరిగే ఉత్సవాలకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేశారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని ఉత్సవాలకు వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా టీటీడీ అధికారులు చలువ పందిల్లు, తాగునీరు, మజ్జిగ, అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం కోదండరాముని కళ్యాణమని.. పండు వెన్నెల్లో రాములోరి కళ్యాణం జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు రాఘవాచార్యులు అంటున్నారు.