కవిత(Kavitha) రిమాండ్ రిపోర్టు(Remand Report)లో సీబీఐ(CBI) సంచలన విషయాలు వెలుగు చూశాయి. ముడుపులపైనే ప్రధానంగా కవితకు సీబీఐ ప్రశ్నలు సంధించింది. శరత్ చంద్రారెడ్డి(Sarath Chandra Reddy) నుంచి వచ్చిన 14 కోట్ల రూపాయలపైనే సీబీఐ ఆరా తీసింది. లేని భూమి ఉన్నట్టుగా చూపారని సీబీఐ అభియోగం నమోదు చేసింది. సదరు భూమి అమ్మకంపై కవిత ఎలాంటి సమాధానం చెప్పలేదని సీబీఐ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. దర్యాప్తును ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించేలా కవిత సమాధానాలు ఉన్నాయని సీబీఐ వివరించింది.
ఇది చదవండి: వారణాసి ఆలయంలో పోలీసులకు దోతి కుర్తా డ్రెస్..!
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి(Magunta Srinivasulureddy), గోరంట్ల బుచ్చిబాబు భేటీలపైనే సీబీఐ అధికారులు కవితను ప్రశ్నించారు. శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్‌తో జరిగిన సమావేశాలపైనా ఆరా తీశారు. తమ ప్రశ్నలకు కవిత సూటిగా సరైన సమాధానాలు ఇవ్వలేదని సీబీఐ ఆరోపించింది. దర్యాప్తును తప్పుదోవ పట్టించేలా కవిత వ్యవహరిస్తున్నారని సైతం వివరించింది. సాక్షులను ప్రభావితం చేయగలిగిన పలుకుబడి ఉన్న వ్యక్తిగా కవితను చెప్పిన సీబీఐ.. ఆధారాలను కవిత ధ్వంసం చేసే, చెరిపేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. కేసుకు సంబంధించి డిజిటల్ పరికరాలు, డాక్యుమెంట్లు పరిశీలించాలని సీబీఐ న్యాయస్థానానికి వివరించింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.