సీఎం జగన్(CM Jagan) గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కు లేదన్నారు మంత్రి అంబటి రాంబాబు(Minister Ambati Rambabu). జగన్ ఏ రోజూ సానుభూతి కోసం ప్రయత్నించలేదని, సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయన్నారు. సీఎం జగన్ ను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము ప్రతిపక్షాలకు లేదన్నారు. కూటమిలో ముగ్గురు కలిసినా, 30 మంది కలిసినా సీఎం జగన్ ను ఓడించలేరన్నారు. జగన్ పై దాడిని ప్రధాని మోదీ ఖండించారని, కానీ చంద్రబాబు, పవన్ కు మాత్రం వెటకారంగా ఉందన్నారు. నాదెండ్లకు ఓటు వేస్తే తెనాలి సర్వ నాశనమవుతుందని హెచ్చరించారు. పవన్ సినిమా యాక్టర్ కాబట్టే చూసేందుకు ప్రజలు వస్తున్నారని, అంతమాత్రనా వారందరూ తనకే ఓటు వేస్తారని ఊహించుకోవద్దన్నారు. అధికారం లేకుండా చంద్రబాబు బతకలేడని.. టీడీపీ నేతలు అశాంతిని సృష్టిస్తారని, అందువలన వైసీపీ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని అంబటి సూచించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: ప్రేమ పేరుతో విద్యార్థిని బ్లాక్ మెయిల్..!
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.