భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి(Shri Sitaramachandra Swamy) వారి దేవస్థానంలో ఈ నెల 17న శ్రీరామనవమి తిరు కళ్యాణ(Sri Rama Navami Thiru Kalyana) మహోత్సవం(Mahotsavam) జరగనుంది. ఈ నేపథ్యంలో కళ్యాణ మండపంలోని ఏర్పాట్లను రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు పరిశీలించారు. కళ్యాణానికి విచ్చేస్తున్న భక్తులకు ఏర్పాటు చేస్తున్న వసతి సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. భద్రాచలం విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు కావాల్సిన లడ్డు ప్రసాదాలను, త్రాగునీటిని ఏర్పాటు చేయాలని సూచించారు. కళ్యాణం అనంతరం భక్తులకు కళ్యాణ తలంబ్రాలు అందేలా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. వీఐపీ, వీవీఐపీ సామాన్య భక్తుల గ్యాలరీలను హనుమంతరావు పరిశీలించారు. కళ్యాణాన్ని దగ్గర నుంచి వీక్షించ కోరే భక్తుల సౌకర్యార్థమై టికెట్లు ఆన్ లైన్ లో ఉంచామని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా హనుమంతరావు కోరారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాల తయారీ..