రైతు భరోసా, పంటల బీమా, రుణమాఫీ పథకం విధివిధానాలపై తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) కసరత్తు ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి ఆదేశానుసారం ఈ పథకాలకు కావాల్సిన నిధుల గురించి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)తో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) చర్చించారు. పంట రుణాల రికవరీ కోసం రైతులను ఇబ్బంది పెట్టొద్దని పరపతి సంఘాలకు, బ్యాంకులకు మంత్రి తుమ్మల(Minister Tummala) సూచించారు.
ఇది చదవండి: హైదరాబాద్ దుండిగల్‌లో కారు బీభత్సం…
వచ్చే వానాకాలనికి సంబంధించి ఎరువులు, విత్తనాలను ముందుగానే సిద్ధం చేసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. మార్కెట్ యార్డులకు తీసుకువచ్చే ధాన్యానికి గిట్టుబాటు ధర అందేవిధంగా చర్యలు చేపట్టాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పండ్లు పక్వానికి వచ్చేందుకు కార్బయిడ్ ప్రయోగించే వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని తుమ్మల నాగేశ్వర్ రావు అధికారులను ఆదేశించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.