అన్నమయ్య జిల్లా… రాజంపేట పట్టణంలో బోయినపల్లి అన్నమాచార్య విశ్వ విద్యాలయం (Annamacharya University) వద్ద విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నిన్న బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న రీనా మహేన్ (Reena Mahen) అనే విద్యార్థి ఆత్మహత్యపై అనేక అనుమానాలు ఉన్నాయని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరసింహ సర్వేపల్లి, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్, పిడియస్ యు జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర అన్నమాచార్య కళాశాల ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ ఈ మేరకు వారు ప్రధాన రహదారి నుంచి కాలేజీ ప్రధాన గేటు వరకు ర్యాలీ నిర్వహించారు. కాలేజీ యాజమాన్యం గేట్లు మూసి వేయడంతో గేటు వద్దనే బైటాయించి నినాదాలు చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
విద్యార్థి సంఘాల నాయకులు గేటు ఎక్కి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కాలేజీ సిబ్బంది విద్యార్థి సంఘాల నాయకులపై దాడికి యత్నించడంతో వారి మధ్య తోపులాట జరిగి కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్బంగా ప్రిన్స్ పాల్ నారాయణ మాట్లాడుతూ… విద్యార్థిని మృతి చెందిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.కాగా విద్యార్థి సంఘాల నాయకులు బాధిత కుటుంబానికి 50 లక్షల నష్ట పరిహారం చెల్లించి న్యాయం చేయాలని, అదేవిధంగా కళాశాలలో బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులు, ఆత్మహత్యలపై చర్యలు తీసుకోవాలని యాజమాన్యానికి డిమాండ్ చేశారు.
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటం
- మాజీ MLA వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధం …
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.