అక్షయ తృతీయ | Akshaya Tritiya
భారతదేశం సంప్రదాయాలకు పుట్టినిల్లు. భారతదేశంలో హిందువులు ఎంతో సాంప్రదాయంగా జరుపుకునే పండుగలలో అక్షయ తృతీయకు(Akshaya Tritiya) ఎంతో ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా భారతదేశంలో మహిళలు ఎంతో ఇష్టంగా జరుపుకునే ఈ అక్షయ తృతీయ పండుగ రోజున లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఆ ఇంట్లో సిరి సంపదలు వస్తాయని నమ్మకం.లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ పండుగను ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ రోజున హిందువులు, జైనులు ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు. అంతేకాకుండా పురాణాల ప్రకారం శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైన రోజని అందువల్లే అక్షయ తృతీయ రోజున బంగారం కొని ఇంట్లో లక్ష్మీదేవిని అలంకరించి పూజిస్తే సిరిసంపదలు కురిసి అష్టైశ్వర్యాలు కలుగుతాయని.. వాటికి కుబేరుడు రక్షణగా ఉండి జీవితం సుఖసంతోషాలతో నిండుతుంది అని తెలుపుతున్నారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.