మాజీ మంత్రి బొత్స పై విజయవాడలో ఏసీబీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యతోపాటు బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తాము ఏసీబీకిచ్చిన ఫిర్యాదును తీసుకుని రశీదు ఇచ్చారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. అవినీతి చేసిన మంత్రులందరూ తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. టీచర్ల వద్ద నుంచి 3 నుంచి 6 లక్షల రూపాయల వరకు ముడుపులు ముట్టాయని తెలిపారు. సుమారు 65 కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. బొత్స హయాంలో జరిగినంత మోసం ఎప్పుడూ ఎక్కడా జరగలేదన్నారు. ఎలక్షన్ కోడ్ వచ్చాక టీచర్ల బదిలీలు చేశారని మండిపడ్డారు. 1600 నుంచి 2500 మంది టీచర్లు మంత్రి, పేషీ ఘనాపాటీలపై దాడికి సిద్ధంగా ఉన్నారని వర్ల రామయ్య అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి భాగోతమంతా ఒక్కొక్కటిగా బయటకు వస్తోందన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
- మాజీ MLA వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధం …మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదు కృష్ణాజిల్లా గన్నవరంలోని వీరవల్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. గత ప్రభుత్వంలో వైసీపీ నేతల దౌర్జన్య కాండకు టీడీపీ నేత మాదాల శ్రీనివాసరావు నష్టపోయారని ఫిర్యాదులో తెలిపారు. తన…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.