తెలంగాణ స్టేట్ పాలిటిక్స్(Telangana State Politics)లో సంచలనం రేపుతోన్న ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణలో దూకుడు పెంచిన పోలీసులు.. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మార్చి 10న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురిని అరెస్ట్ చేశారు. మరో ఆరుగురిని నిందితులుగా చేర్చారు. తాజాగా కోర్టులో దాఖలు చేసిన చార్జ్ షీట్‌లో ఈ విషయాలను పేర్కొన్నారు. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలువురు ప్రతిపక్ష నేతలు, సినీ ప్రముఖులు, రియల్టర్లు, వ్యాపారస్తుల ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు వెలుగులోకి రావడంతో ఈ ఇష్యూని కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ మేరకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలుప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల…
- నష్టాల్లో కంగువా నిర్మాత … అండగా హీరో సూర్యదర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా, తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువా. ఇది ఒక పీరియాడికల్ డ్రామా కాన్సెప్ట్ తో సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా…
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.