దేవుడు తనకి ఇచ్చినటువంటి శక్తినంత రాయదుర్గం నియోజకవర్గం అభివృద్ధి కోసం ఉపయోగిస్తానని శాసనసభ్యులు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. 40, 650 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించిన అనంతరం తొలిసారిగా రాయదుర్గం వచ్చిన శాసనసభ్యులు కాలవ శ్రీనివాసులు తెదేపా శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రాయదుర్గంలోని ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద ఆయనకు తెదేపా శ్రేణులు ఘన స్వాగతం పలికారు. శాలువా, పూలమాలలు, గజమాలతో సన్మానించి ఘన స్వాగతం పలికారు. అనంతరం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం.వేలాదిమంది కార్యకర్తలు నడుమ అంగరంగ వైభవంగా పండుగ వాతావరణం లో విజయోత్సవ ర్యాలీ కొనసాగింది. డీజే, నృత్యాలతో సంబరంగా ర్యాలీ కొనసాగింది. తెదేపా శ్రేణులు అడుగడుగునా ఆయనను శాలువాలు, పూలమాలతో సన్మానించారు. ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద ప్రారంభమైన విజయోత్సవ ర్యాలీ బళ్ళారి రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం వరకు చేరేందుకు దాదాపు మూడు గంటల సమయం పట్టింది. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాయదుర్గంలో పేదరికాన్ని తరిమికొట్టేంతవరకు నిర్విరామంగా అహర్నిశలు కృషి చేస్తామని పేర్కొన్నారు. భైరవాని తిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలు అందించడంతోపాటు ఉంతకల్లు వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం పనులు ప్రారంభిస్తామన్నారు. అదేవిధంగా హెచ్ ఎల్ సి ఆధునీకరణ పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రాయదుర్గం నియోజకవర్గం లో లక్ష ఎకరాలకు సాగునీరంందించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. ఐదేళ్లు ఇబ్బందులు పడి తనకు అండగా నిలిచిన కార్యకర్తలను తన కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకుంటానని తెలిపారు.కాలవ విజయవత్సవ ర్యాలీలో నియోజకవర్గ ప్రజలే కాకుండా కళ్యాణదుర్గం, బళ్ళారి తదితర ప్రాంతాలనుంచి వేలాదిమంది తేదేపా నాయకులు, కార్యకర్తలుపెద్ద ఎత్తున తరలివచ్చారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలుప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల…
- నష్టాల్లో కంగువా నిర్మాత … అండగా హీరో సూర్యదర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా, తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువా. ఇది ఒక పీరియాడికల్ డ్రామా కాన్సెప్ట్ తో సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా…
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.