దేవుడు తనకి ఇచ్చినటువంటి శక్తినంత రాయదుర్గం నియోజకవర్గం అభివృద్ధి కోసం ఉపయోగిస్తానని శాసనసభ్యులు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. 40, 650 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించిన అనంతరం తొలిసారిగా రాయదుర్గం వచ్చిన శాసనసభ్యులు కాలవ శ్రీనివాసులు తెదేపా శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రాయదుర్గంలోని ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద ఆయనకు తెదేపా శ్రేణులు ఘన స్వాగతం పలికారు. శాలువా, పూలమాలలు, గజమాలతో సన్మానించి ఘన స్వాగతం పలికారు. అనంతరం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం.వేలాదిమంది కార్యకర్తలు నడుమ అంగరంగ వైభవంగా పండుగ వాతావరణం లో విజయోత్సవ ర్యాలీ కొనసాగింది. డీజే, నృత్యాలతో సంబరంగా ర్యాలీ కొనసాగింది. తెదేపా శ్రేణులు అడుగడుగునా ఆయనను శాలువాలు, పూలమాలతో సన్మానించారు. ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద ప్రారంభమైన విజయోత్సవ ర్యాలీ బళ్ళారి రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం వరకు చేరేందుకు దాదాపు మూడు గంటల సమయం పట్టింది. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాయదుర్గంలో పేదరికాన్ని తరిమికొట్టేంతవరకు నిర్విరామంగా అహర్నిశలు కృషి చేస్తామని పేర్కొన్నారు. భైరవాని తిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలు అందించడంతోపాటు ఉంతకల్లు వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం పనులు ప్రారంభిస్తామన్నారు. అదేవిధంగా హెచ్ ఎల్ సి ఆధునీకరణ పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రాయదుర్గం నియోజకవర్గం లో లక్ష ఎకరాలకు సాగునీరంందించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. ఐదేళ్లు ఇబ్బందులు పడి తనకు అండగా నిలిచిన కార్యకర్తలను తన కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకుంటానని తెలిపారు.కాలవ విజయవత్సవ ర్యాలీలో నియోజకవర్గ ప్రజలే కాకుండా కళ్యాణదుర్గం, బళ్ళారి తదితర ప్రాంతాలనుంచి వేలాదిమంది తేదేపా నాయకులు, కార్యకర్తలుపెద్ద ఎత్తున తరలివచ్చారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- కావలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అలేఖ్యపై తీవ్ర ఆరోపణలు.కావలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోతుగంటి అలేఖ్య పై స్థానికంగా తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలలో ఆమె పాలన పట్ల ఆవేదన ఉంది. గతంలో చెక్ పోస్టుల వద్ద వచ్చే ఆదాయం సగానికి తగ్గిపోయిందని, గత చైర్మన్ల ఆధీనంలో ఉన్న…
- మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ పై స్థానికంగా చర్చ.రాజకీయాల్లో నేతలు కండువాలు మార్చడం అనే ట్రెండు… ఇప్పుడు కామన్ అయిపోయింది….! ఎట్ ది సేమ్ టైం ఫాలోయర్స్ కూడా నాయకులను బ్లైండ్ గా ఫాలో అయిపోతున్నారు…. దీంతో నేతలకు పార్టీలు కండరాలు మార్చటం మంచినీళ్లు ప్రాయంగా మారిపోయింది… నెల్లూరు జిల్లాలో…
- వెంకటగిరిలోని విశ్వోదయ కళాశాల భూమిపై కబ్జా కోరుల కన్ను !ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వేంకటగిరి పట్టణ కేంద్రంలో ఉన్న విశ్వోదయ కాలేజీ భూమి వివాదం ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది. దశాబ్దాల క్రితం ప్రజా అవసరాల కోసం కేటాయించబడిన ప్రభుత్వ భూములు కాలక్రమంలో కొన్ని చోట్ల దుర్వినియోగానికి గురవుతున్నాయని స్థానికులు…
- ఈత సరదా అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి..అమెరికాలోని లూసియానాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తెలంగాణవాసి అనురూప్ రెడ్డి ..ముగ్గురు స్నేహితులను కాపాడి..అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. సరదాగా ముగ్గురు స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు లూసియానాలోని టొరోడో పార్క్‌లోని సెబాన్ రివర్‌లోకి కోడూరు అనురూప్ రెడ్డి వెళ్లాడు. హఠాత్తుగా…
- తెలంగాణ లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే -మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు.కరీంనగర్ గడ్డ బిజెపి అడ్డాగా బండి సంజయ్ నిలబెట్టారని, ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించడంలో బండి సంజయ్ పట్టుదల, కరీంనగర్ బిజెపి శ్రేణుల కసి తోనే బల్దియా పై కాషాయ జెండా ఎగిరిందనీ, ఇలాంటి ఫలితం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 90203