బొగ్గు గనుల వేలంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య ఎక్స్ వేదికగా ట్వీట్ల యుద్ధం సాగింది. ‘రేవంత్ గారూ’ అని కేటీఆర్ ట్వీట్ చేసి ప్రశ్నిస్తే… ‘కేటీఆర్ గారూ’ అంటూ రేవంత్ రెడ్డి ప్రతిస్పందించారు.
పీసీసీ అధ్యక్షుడిగా 2021లో మీరు బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేయాలని, 4 బ్లాక్‌లను సింగరేణికి బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయం గుర్తుంచుకోవాలంటూ నాడు రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ గుర్తు చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారని… కానీ అప్పుడు వేలాన్ని వ్యతిరేకించి, ఇప్పుడు వేలం పాట కోసం ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కను పంపించడం ఏమిటని విమర్శించారు. మీలో మార్పుకు గల కారణాలు చెప్పాలని నిలదీశారు.
బొగ్గుగనుల వేలంపై కేటీఆర్ ట్వీట్‌కు రేవంత్ రెడ్డి రీట్వీట్ చేస్తూ సమాధానం ఇచ్చారు. పదేళ్లుగా మీరు తెలంగాణ ఏం చెబుతుందో పట్టించుకోలేదని… ఇప్పుడు కూడా మీది అదే ధోరణి అని కేటీఆర్‌ను ఉద్దేశించి విమర్శించారు. తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులు, కేడర్ అంతా కేంద్ర ప్రభుత్వ, గత కేసీఆర్ ప్రభుత్వ ప్రైవేటీకరణను వ్యతిరేకించిందని పేర్కొన్నారు. సింగరేణి మొదటి, రెండో బ్లాక్‌లను కేంద్రం విక్రయించినప్పుడు కేసీఆర్ సీఎంగా ఉన్నారని… నాడు అరబిందో, అవంతిక కంపెనీలకు విక్రయించారన్నారు. ఆ రోజు బీఆర్ఎస్ ప్రైవేటీకరణను వ్యతిరేకించలేదని విమర్శించారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సింగరేణి బ్లాక్‌ల ప్రైవేటీకరణను, వేలాన్ని వ్యతిరేకిస్తున్నారని… అదే సమయంలో అవంతిక, అరబిందోలకు విక్రయించిన బొగ్గు బ్లాక్‌లను రద్దు చేసి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారని తెలిపారు. బొగ్గుగనుల వేలంపై కేటీఆర్ ట్వీట్‌కు రేవంత్ రెడ్డి రీట్వీట్ చేసారు . తెలంగాణ ప్రజలు, వారి ప్రయోజనాలు, ఆస్తులు, హక్కులు, భవిష్యత్తు… కాంగ్రెస్‌తోనే సురక్షితమన్నారు. మన బొగ్గు గురించి మాత్రమే కాదు… ప్రజల ప్రతి హక్కు గురించి పోరాడుతామన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలుప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల…
- నష్టాల్లో కంగువా నిర్మాత … అండగా హీరో సూర్యదర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా, తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువా. ఇది ఒక పీరియాడికల్ డ్రామా కాన్సెప్ట్ తో సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా…
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి