కరీంనగర్ జిల్లా బీఆర్ ఎస్ అధ్యక్షుడు జి వి రామకృష్ణ రావు ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ చౌరస్తాలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆశీస్సులతో ,బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తల కష్టంతో , ,బి ఆర్ ఎస్ పార్టీ బి ఫాం పై గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు కన్న తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేస్తూ, ద్రోహపూరితమైన కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోవడం సిగ్గుచేటని కరీంనగర్ జిల్లా బిఆర్ ఎస్ అధ్యక్షుడు జి వి రామకృష్ణ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు..ఈ సందర్భంగా జీవి రామకృష్ణ మాట్లాడుతూ కన్నతల్లి లాంటి పార్టీకి ద్రోహం చేస్తూ సొంత లాభం కోసం ఓట్లు వేసిన కార్యకర్తలను ప్రజలను మోసం చేయడం కరెక్ట్ కాదని చేతనైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీమారాలని డిమాండ్ చేయడం జరిగింది.జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం..సిగ్గు ఎగ్గు లేకుండా ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని…ఇలాంటి చర్యలు కాంగ్రెస్ దిగజారుడుతనానికి నిదర్శనమని హెచ్చరించారు…
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలుప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల…
- నష్టాల్లో కంగువా నిర్మాత … అండగా హీరో సూర్యదర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా, తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువా. ఇది ఒక పీరియాడికల్ డ్రామా కాన్సెప్ట్ తో సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా…
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.