18వ లోక్సభ స్పీకర్ ఎన్నికల్లో ఓం బిర్లా విజయం సాధించారు . బిర్లా కాంగ్రెస్కు చెందిన కె సురేష్తో పోటీ పడి గెలుపొందారు. ఓం బిర్లా 17వ లోక్సభలో స్పీకర్ పదవిని కూడా నిర్వహించారు. ఆ సమయంలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్డీయే మరోసారి ఆయనను అభ్యర్థిగా నిలబెట్టింది. రాజస్థాన్లోని కోట బుండి స్థానం నుంచి ఆయన మూడోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ఎంపీ కూడా వరుసగా రెండు సార్లు స్పీకర్గా వ్యవహరించలేదు. లోక్ సభ సంఖ్యా బలం కారణంగా ఆయన గెలుపు ఖాయమైంది. ఓం బిర్లా1962 నవంబర్ 23న కోటాలో జన్మించారు. ఆయన విద్యార్థి దశలోనే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవారు. 1991లో భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. యువ మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడిగా 1997లో నియమితులయ్యారు.
మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఓం బిర్లా.. తొలిసారిగా 2003లో కోటా సౌత్ స్థానం నుంచి గెలిచి రాజస్థాన్ శాసనసభ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో రాజస్థాన్లోని కోటా లోక్ సభ స్థానం నుంచి పోటీ చేశారు. అక్కడ కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన ప్రహ్లాద్ గుంజాల్పై 41 వేల ఆధిక్యంతో గెలుపొందారు. గడిచిన 20 ఏళ్లలో లోక్ సభకు మరోసారి ఎన్నికైన నేతగా బిర్లా నిలిచారు. ఓం బిర్లా 2014 నుంచి కోట లోక్ సభ స్థానాన్ని కంచుకోటగా మార్చుకున్నారు. 2019లో లోక్సభ స్పీకర్గా ఎన్నికయ్యారు
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలుప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల…
- నష్టాల్లో కంగువా నిర్మాత … అండగా హీరో సూర్యదర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా, తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువా. ఇది ఒక పీరియాడికల్ డ్రామా కాన్సెప్ట్ తో సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా…
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి