కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు పెద్ద పీట వేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్డీయే సర్కారు కట్టుబడి ఉందని పేర్కొంటూ ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ. 15 వేల కోట్లు ప్రకటించారు. అంతేకాదు, అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర బడ్జెట్ లో అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు ప్రత్యేక సాయంగా అందిస్తామని చెప్పారు. దీంతో పాటు అమరావతి అభివృద్ధికి అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు ఇస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేయడానికి ఏపీ ప్రభుత్వానికి సహాయసహకారాలు అందిస్తామని అన్నారు. ఇక, రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. విశాఖ- చెన్నై కారిడార్‌లో కొప్పర్తికి, హైదరాబాద్- బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లుకు నిధులు కేటాయించామని వివరించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- మాజీ సీఎం జగన్‌కు మంత్రి నారా లోకేష్ సవాల్.తాడేపల్లి ప్యాలెస్‌కు సమీపం నుంచి జగన్‌కు సవాల్ విసిరారు మంత్రి లోకేష్. డీఎస్సీపై చర్చకు సిద్ధమా అంటూ ఛాలెంజ్ చేశారు. ‘‘జగన్ ఇంటికి 200 మీటర్ల దూరంలో నిలబడే మాట్లాడుతున్నా. గొడ్డలి పార్టీ నేతల్లా బురద చల్లి పారిపోయే రకం కాదన్నారు.…
- చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మరో భారీ మైలురాయిని అందుకుంది. 400 కోట్ల గ్రాస్ మార్క్‌ను అధిగమించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ రూరల్…
- ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..ఆదిలాబాద్ పట్టణ రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా పట్టణంలోని పలు వార్డుల్లో కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న మురికి కాలువలు, అంతర్గత రోడ్లు, గాంధీ పార్క్ కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే…
- అభిమాని నిరంజన్ను పరామర్శించిన పవన్.ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హన్మకొండలో పర్యటిస్తున్నారు. స్థానిక హనుమాన్ నగర్ లో నిరంజన్ అనే బాలుడు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు. తనచివరి కోరిక అభిమాన నటుడైన పవన్ కల్యాణ్ ను కలవడమేనని చెప్పడంతో.. ఆ బాలుడిని చూసేందుకు పవన్…
- ఘనంగా జరిగిన ‘కళాంకి భైరవుడు’ టీజర్ లాంచ్.కళాంకి భైరవుడు ఓ విభిన్నమైన గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన మిస్టికల్ థ్రిల్లర్. చేతబడులు, క్షుద్ర పూజలు, నిజ జీవితంలో జరిగిన కొన్ని ఆశ్చర్యకర సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుంది. దర్శకుడు హరి హారన్.వి తన…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 147538