తెలంగాణకు చెందిన ఎంపీలు … లోక్ సభలో తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం సభలో దుమారం రేపింది. ఆయన ప్రమాణంపై అధికార పక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది. అసదుద్దీన్ ప్రమాణం చేసిన తర్వాత చివరలో జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అని నినాదాలు చేశారు. ఈ నినాదాలపై అధికార పక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. వరంగల్ ఎంపీ కడియం కావ్య తెలుగులో ప్రమాణం చేశారు. ప్రమాణం చివరలో కావ్య జై భీమ్, జై భద్రకాళి, సేవ్ కానిస్టిట్యూషన్ అని నానాదాలు చేశారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి ఇంగ్లీష్‌లో ప్రమాణం చేశారు. చివరలో జై హింద్, జై తెలంగాణ, జై సంవిధాన్ అని నినదించారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంగ్లీష్‌లో ప్రమాణం చేశారు. గోడం నగేశ్, అసదుద్దీన్ ఒవైసీ హిందీలో ప్రమాణం చేశారు. గడ్డం వంశీకృష్ణ, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇంగ్లీష్‌లో ప్రమాణం చేశారు. సురేశ్ షెట్కార్, ఈటల రాజేందర్, డీకే అరుణ, మల్లు రవి, కుందూరు రఘవీర్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్ తెలుగులో ప్రమాణం చేశారు. ఈటల జై సమ్మక్క సారలమ్మ అని నినదించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’ ఇప్పుడు తెలుగు ZEE5లోనూ అద్భుతమైన రికార్డు సృష్టించింది. కేవలం ఒక్క వారంలోనే 200 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేయటం విశేషం. ఈ ఘనత సినిమాకు ఓ చారిత్రాత్మక స్ట్రీమింగ్…
- అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.అమరావతి రాజధాని నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్మాణానికి ఎలాంటి కట్టడాలు చేపట్టాలన్నా భూమి అవసరమని తెలిపారు. చంద్రబాబుపై నమ్మకంతోనే రాజధాని రైతులు తమ భూములను భూసమీకరణకు ఇచ్చారని అన్నారు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకుండానే…
- నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు ముప్పు ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో గత నెల తుర్కియే పర్యటన తర్వాత విమానం మార్చినట్లు వెల్లడించారు. ఎయిర్‌ఫోర్స్ వన్‌కు బదులుగా భద్రతా కారణాలతో రహస్యంగా మరో విమానంలో అమెరికాకు చేరుకున్నట్లు తెలిపారు. ఆ బెదిరింపులకు…
- సీతంపేటలో నూతన సబ్ డిపో ప్రారంభం.పార్వతిపురం మన్యం జిల్లా కురుపాం మండలం సీతంపేట గ్రామ ప్రజలకు ఊరట కలిగింది. ఎన్నో ఏళ్లుగా రేషన్ సరుకుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న గ్రామస్తుల సమస్యకు పరిష్కారం లభించింది. సీతంపేట గ్రామంలో నూతన సబ్ డిపో కేంద్రాన్ని…
- అమరావతిలో స్టీల్ బ్రిడ్జిలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు.మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారంటూ విమర్శఅమరావతి నిర్మాణ పనుల్లో మరో కీలక ముందడుగు పడింది. ఉండవల్లి సమీపంలో నిర్మించిన స్టీల్ బ్రిడ్జిలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. బ్రిడ్జిల వద్ద ప్రత్యేకంగా నిర్మించిన అమరావతి పైలాన్‌ను కూడా సీఎం ఆవిష్కరించారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి