Sunday, March 15, 2026
News Navigation

Breaking

Sunday, March 15, 2026
Home Telangana ప్రజాస్వామ్యానికి చీకటి రోజు… బీజేపీ మౌన ప్రదర్శన ర్యాలీ

ప్రజాస్వామ్యానికి చీకటి రోజు… బీజేపీ మౌన ప్రదర్శన ర్యాలీ

by Satya
ప్రజాస్వామ్యానికి చీకటి రోజు... బీజేపీ మౌన ప్రదర్శన ర్యాలీ

25 జూన్ 1975 రోజున అప్పటి ప్రధాని ఇందిరగాంధీ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ రాజ్యాంగాన్ని అపహస్యం చేస్తూ విధించిన ఎమర్జెన్సీ దినాన్ని “ప్రజాస్వామ్యానికి చీకటి రోజు” గా జరుపుతూ బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని అర్చన టెక్స చౌరస్తా నుండి గాంధీ పార్క్ వరకు మౌన ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పాల్వాయి హరీష్ మాట్లాడుతూ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ 25 జూన్ 1975 రోజున ఎమర్జెన్సీ విధించడం బాధాకరం అని అన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుంది అని బీజేపీ పార్టీ పై దుష్ప్రచారం చేసే కాంగ్రెస్ పార్టీ 75 సార్లు రాజ్యాంగాన్ని మార్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని ఎద్దేవా చేశారు .ప్రజాస్వామ్యానికి చీకటి రోజు… బీజేపీ మౌన ప్రదర్శన ర్యాలీ లో ఆనాడు విధించిన ఎమర్జెన్సీ దినాన్ని ఒక్క చీకటి రోజుగా గుర్తిస్తూ ఈరోజు ఎమర్జెన్సీ వ్యతిరేక దినంగా జరూపుకోవడం జరుగుతుంది అని తెలిపారు.

Follow us on : Facebook, Instagram, YouTube & Google News

  • తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంలో విచారణ..
    తిరుమల లడ్డూ వ్యవహారంలో దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఈ వ్యవహారంపై కామెంట్లు చేయకుండా నిలువరించాలని..మానూరు శ్రీనివాస్‌ పిటిషన్‌ వేశారు. ఈ కామెంట్లపై సీబీఐ ఎలాంటి దర్యాప్తు జరపలేదని పేర్కొన్నారు. అయితే.. దర్యాప్తు పెండింగ్‌లో ఉన్నప్పుడు జోక్యం…
  • ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్
    ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్..లీసాగిల్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. పంజాబ్- హర్యానా హైకోర్టు నుంచి బదిలీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చిన జస్టిస్ లీసా గిల్..న్యాయరంగంలో విశేష…
  • అమరావతిలో రెండో రోజు కలెక్టర్ల సమావేశం.
    కలెక్టర్ల సదస్సులో అటవీశాఖాధికారులపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదని మండిపడ్డారు. ఎంత చెప్పినా మీలో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అటవీ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివసిస్తున్న ప్రజలకు నీళ్లివ్వకూడదు, కరెంటివ్వకూడదు, ఇళ్లు…
  • నెట్‌ఫ్లిక్స్‌ హైదరాబాద్‌ వచ్చిందంటే హాలీవుడ్‌ వచ్చినట్లేనని సీఎం రేవంత్ అన్నారు.
    నెట్‌ఫ్లిక్స్‌ హైదరాబాద్‌ వచ్చిందంటే హాలీవుడ్‌ వచ్చినట్లేనని సీఎం రేవంత్ అన్నారు. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఐలైన్ స్టూడియో కార్యాలయాన్ని హైటెక్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ అన్ని అవకాశాలను కల్పిస్తుందని నెట్ ఫ్లిక్స్ కు…
  • పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.
    పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ప్రభుత్వం ఇంధన ధరలను పెంచిన వెంటనే, దేశంలోని ప్రధాన నగరాల్లోని రిటైల్ వ్యాపారులు నిత్యావసర వస్తువులు, తినుబండారాల ధరలను అమాంతం పెంచేశారు. పాత ధరలకు కొనుగోలు చేసిన సరుకులపైనే…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.