రాజధాని నగరమైన గ్రేటర్ హైదరాబాద్ నానాటికి విస్తరిస్తుండటంతో పాటు జనాభా కూడా విపరీతంగా పెరుగుతోంది. దీంతో మహానగరంలో రోడ్ల వెడల్పు ప్రహసనంగా మారింది. రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ నుంచి ఉపశమనం కల్పించేందుకు జీహెచ్ఎంసి, ట్రాఫిక్ విభాగాలు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినా , రోడ్ల వెడల్పు కార్యక్రమం విమర్శలకు దారి తీస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్ ప్రాంతాల్లో పెరిగిపోయిన ట్రాఫిక్ ను నివారించేందుకు అధికారులు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. అయితే ఈ ప్రయోగాల పట్ల స్థానికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తమ ఇల్లు కూల్చి రోడ్లు వేస్తారా..! వెడల్పు చేసే కంటే… కళ్ల ముందు కనిపిస్తున్న ప్రత్యామ్నాయాలను చూడాలని ప్రజలు కోరుతున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి