బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ అస్థిరంగా ఉందని, పూర్తికాలం అధికారంలో కొనసాగకపోవచ్చునని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ముంబైకి వచ్చిన ఆమె శరద్ పవార్, ఉద్దవ్ ఠాక్రేలతో భేటీ అయ్యారు. లోక్ సభ ఎన్నికల తర్వాత వీరితో భేటీ కావడం ఇదే మొదటిసారి. భేటీ అనంతరం ఆమె మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో ఆట ఇప్పుడే మొదలైందన్నారు.
జూన్ 25వ తేదీని ప్రధాని మోదీ రాజ్యాంగ హత్యాదినంగా ప్రకటించడంపై కూడా ఆమె స్పందించారు. తాము ఎమర్జెన్సీకి వ్యతిరేకమని మోదీ హయాంలోనే అత్యయిక పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయని విమర్శించారు. మూడు కొత్త నేర న్యాయ బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ఎవరినీ సంప్రదించలేదన్నారు. పెద్ద సంఖ్యలో ఎంపీలు సస్పెన్షన్‌కు గురైన సమయంలో వాటిని ఆమోదించారని ఆరోపించారు. కొత్త చట్టాల విషయంలో చాలామందిలో ఆందోళన నెలకొంది అంటూ మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేసారు .
పశ్చిమ బెంగాల్లో లెఫ్ట్ ఫ్రంట్‌తో పోరాడి తాము అధికారంలోకి వచ్చామని ఈ నేపథ్యంలో అక్కడ సీపీఎంతో సర్దుబాటు సాధ్యం కాదని స్పష్టం చేశారు. రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్దవ్ ఠాక్రే పార్టీ తరఫున ప్రచారం చేస్తానని తెలిపారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలో ఇండియా కూటమి మంచి ఫలితాలు సాధించిందన్నారు. ఇదే ఉత్సాహంతో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్నాయన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- శివనామస్మరణతో మార్మోగుతున్న ద్రాక్షారామంకార్తీక మాసంలో చివరి సోమవారం కావడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలోని శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయం శివనామ స్మరణతో మార్మోగింది. తెల్లవారుజాము నుంచే మహిళలు గోదావరి నదిలో స్థానం ఆచరించి అరటి దొప్పలతో దీపాలు…
- నెరవేరనున్న ఏపీ ప్రజల చిరకాల వాంఛరైల్వే శాఖకు సంబంధించి రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. ఏళ్లుగా ఊరిస్తున్న దక్షిణకోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. విశాఖ కేంద్రంగా జోన్ కార్యకలాపాల కోసం భవనాల నిర్మాణానికి రైల్వేశాఖ టెండర్లు ఆహ్వానించింది. జోన్…
- విజయవాడ మేయర్ కు పదవీ ముప్పువిజయవాడ నగరపాలక సంస్థలో మేయర్ కు పదవీ ముప్పు తప్పేలా లేదు. ఎన్నికలకు ముందు నగరపాలక సంస్థలో 49 మంది కార్పొరేటర్లతో ఉన్న వైసీపీ బలం ప్రస్తుతం 38కి తగ్గిపోయింది. వీరిలోనూ మరో 10 మందికిపైగా కూటమి పార్టీల…
- ఆదాయాన్ని పెంచడానికి .. సామాన్యులపై రోడ్ టాక్స్ భారంపెట్రల్, డీజిల్ తో నడిచే నూతన వాహనాలకు విధించే రోడ్ ట్యాక్స్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో వాహనాల ద్వారా వస్తున్న ఆదాయం, రిజిస్ట్రేషన్ విధానం తదితర అంశాలపై రాష్ట్ర రవాణా…
- JEE పరీక్షల షెడ్యూల్ విడుదల ..దేశవ్యాప్తంగా ఉన్న NITలు, IIITల్లో Btech, బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) 2025 జవనరి సెషన్ కోసం దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. అయితే గడువు సమయం ముగిసే నాటికి దరఖాస్తు ప్రక్రియ ఊపందుకుంది.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి