అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ మేరకు వైట్ హౌస్ ప్రకటన రిలీజ్ చేసింది. అధ్యక్షుడు స్వల్ప దగ్గు, జలుబుతోపాటు జ్వరంతో బాధపడుతున్నారని పేర్కొంది. ప్రస్తుతం బైడెన్ డెలావేర లోని సముద్రతీరంలో ఉన్న తన ఇంట్లో ఐసోలేషన్ లో ఉంటూ కోవిడ్ మందులు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా లాస్ వెగాస్ లో ప్రచారంలో ఉన్న బైడెన్ కు కోవిడ్ పాజిటివ్ ఉన్నట్లు తేలడంలో వెంటనే ఆయన ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు వెల్లడించారు. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కోవిడ్ బారిన పడ్డట్లు వైట్ హౌస్ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలిపింది. తనకు తీవ్ర అనారోగ్య సమ్యలు తలెత్తితే అధ్యక్ష బరి నుంచి వైదొలుగుతానని బైడెన్ ఓ ఇంటర్వ్యూలో ప్రకటించారు. అలా చెప్పిన కొన్ని గంటల వ్యవధిలోనే అనారోగ్యానికి గురికావడం గమనార్హం.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- మాజీ MLA వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధం …మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదు కృష్ణాజిల్లా గన్నవరంలోని వీరవల్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. గత ప్రభుత్వంలో వైసీపీ నేతల దౌర్జన్య కాండకు టీడీపీ నేత మాదాల శ్రీనివాసరావు నష్టపోయారని ఫిర్యాదులో తెలిపారు. తన…
- ప్రకృతి ప్రేమికులతో నిండిపోయిన … తుర్కం చెరువునిర్మల్ జిల్లాలోని పురాతన చెరువైన తుర్కం చెరువు వద్ద ప్రకృతి ప్రేమికుల సందడి నెలకొంది. మామడ మండలంలోని పొనకల్ గ్రామ శివారులో గల తుర్కమ్ చెరువు బర్డ్స్ ఫెస్టివల్ కు వేదిక అయ్యింది. 1913 లో నిర్మించబడిన ఈ…
- డేంజర్ లో హైదరాబాద్ …కొన్ని రోజులుగా వాతావరణంలో మీకు మార్పు గమనించారా . జలుబు ,దగ్గు ,తుమ్ములు వంటి సమస్యలు మీకు ఎదురయ్యాయా ?అసలు ఏం జరుగుతుందో తెలుసా.. మనం ప్రమాదంఅంచుల్లో పడిపోతున్నాం.. వెంటనే అప్రమత్తం అవ్వండి. కాలుష్యానికి బ్రాండ్ గా ఉన్నఢిల్లీ…
- శివనామస్మరణతో మార్మోగుతున్న ద్రాక్షారామంకార్తీక మాసంలో చివరి సోమవారం కావడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలోని శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయం శివనామ స్మరణతో మార్మోగింది. తెల్లవారుజాము నుంచే మహిళలు గోదావరి నదిలో స్థానం ఆచరించి అరటి దొప్పలతో దీపాలు…
- నెరవేరనున్న ఏపీ ప్రజల చిరకాల వాంఛరైల్వే శాఖకు సంబంధించి రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. ఏళ్లుగా ఊరిస్తున్న దక్షిణకోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. విశాఖ కేంద్రంగా జోన్ కార్యకలాపాల కోసం భవనాల నిర్మాణానికి రైల్వేశాఖ టెండర్లు ఆహ్వానించింది. జోన్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి