బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్నాయని , తనను అప్రతిష్ఠపాలు చేసేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్, రేవంత్ తో కలిసిపోయానన్న వ్యాఖ్యలను నిరూపించాలన్నారు. లేదంటే వారం రోజుల్లో ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డెడ్ లైన్ విధించారు. అయితే ..కేటీఆర్ పంపిన లీగన్ నోటీసులకు భయపడేది లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. లీగల్ నోటీసులతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడే వారు ఎవరూ లేరన్నారు.
మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. నన్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక లీగల్ నోటీసు ఇవ్వడం చూస్తుంటే జాలేస్తోందన్నారు. తొలుత నాపై వ్యక్తిగత ఆరోపణలు చేసి ఆరోపించింది కేటీఆరేనని అందుకు బదులుగా నేను మాట్లాడానన్నారు. కేటీఆర్ సుద్దపూస అనుకుంటున్నాడేమో ఆయన బాగోతం అంతా ప్రజలకు తెలుసన్నారు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు వ్యవహారం లో ఏం జరిగిందో, ఆ కేసులను ఏ విధంగా నీరుగార్చారో తెలుసన్నారు. ఇప్పటి వరకు మాటకు మాటతోనే బదిలిచ్చానని లీగల్ ఇక నోటీసులకు నోటీసులతోనే జవాబిస్తానని కాచుకోవాలన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
- పల్లె, పట్నం తేడా లేకుండా వణికిస్తున్న చలిపల్లె పట్నం తేడా లేకుండా రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. పలుచోట్ల రాత్రిళ్లు చలి మంటలు, ఉదయం పూట పొగ మంచు దృశ్యాలే కనిపిస్తున్నాయి. రెండు మూడు రోజులుగా రాష్ట్రంపై మంచుదుప్పటి పరుచుకున్నట్లు వాతావరణం మారింది. రాత్రిపూటే కాకుండా మిట్ట…
- మాజీ MLA వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధం …మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదు కృష్ణాజిల్లా గన్నవరంలోని వీరవల్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. గత ప్రభుత్వంలో వైసీపీ నేతల దౌర్జన్య కాండకు టీడీపీ నేత మాదాల శ్రీనివాసరావు నష్టపోయారని ఫిర్యాదులో తెలిపారు. తన…
- ప్రకృతి ప్రేమికులతో నిండిపోయిన … తుర్కం చెరువునిర్మల్ జిల్లాలోని పురాతన చెరువైన తుర్కం చెరువు వద్ద ప్రకృతి ప్రేమికుల సందడి నెలకొంది. మామడ మండలంలోని పొనకల్ గ్రామ శివారులో గల తుర్కమ్ చెరువు బర్డ్స్ ఫెస్టివల్ కు వేదిక అయ్యింది. 1913 లో నిర్మించబడిన ఈ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి