సాతాఫ్రికాతో 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నేడు ఇండియా రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టుతో తలపడనుంది. డర్బన్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో సంజు శాంసన్ 50 బంతుల్లో 107 పరుగులు చేసి రాణించడంతో టీమిండియా 61 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ చెరో మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో ‘కీ’ రోల్ పోషించారు. అయితే తొలి మ్యాచ్‌లో టాప్ ఆర్డర్ భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలమైంది.
మరో వైపు సౌతాఫ్రికా కీలకమైన ఆటగాళ్లు క్వింటన్ డికాక్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే మరియు తబ్రేజ్ షంషీ లేకపోవడంతో ఇబ్బందులు పడింది. ఫామ్ లేమితో బాధపడుతున్న సాతాఫ్రికా జట్టు వెస్టీండిస్‌తో సిరీస్ కోల్పోవడంతో పాటు ఐర్లాండ్‌తో సిరీస్‌ను డ్రా చేసుకుంది. సౌతాఫ్రికా జట్టు రెండో టీ20లో గెలవాలంటే సీనియర్లు మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్ రాణించాల్సిందే. టీంఇండియాలో ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్‌లో వరుసగా తడపడటం ఇబ్బందిగా మారింది. అందివచ్చిన అవకాశాలను భారీ స్కోర్లు మలచడంలో ఈ ఓపెనర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ విఫలం అవుతున్నాడు. అయితే తొలి మ్యాచ్‌లో తిలక్ వర్మ వేగంగా 33 పరుగులు చేసి రాణించాడు.
సూర్య కుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా వంటి ఆటగాళ్లతో కూడిన మిడిల్ ఆర్డర్ మంచి ఆరంభం లభించిన తర్వాత తడబడింది. దీంతో భారత్ కేవలం 36 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఒక్క సారిగా మిడిల్ ఆర్డర్ లోయర్ ఆర్డర్ కుప్పకూలడంతో ప్రశ్నలు తలెత్తాయి. ఇండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ తలో మూడు వికెట్లు రాబట్టి సౌతాఫ్రికాను 141 పరుగుల వద్ద నిలువరించడంలో కీలక పాత్ర పోషించడం భారత్‌కు అనుకూలంగా మారింది. అర్షదీప్, ఆవేశ్ ఖాన్ బంతితో సౌతాఫ్రికా బ్యాటర్లను ఇబ్బంది పెట్టి స్ట్రాంగ్ పర్ఫామెన్స్ ఇచ్చారు. దీంతో రెండవ టీ20లో ఎలాగైనా గెలవాలని టీమిండియా భావిస్తోంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
- పల్లె, పట్నం తేడా లేకుండా వణికిస్తున్న చలిపల్లె పట్నం తేడా లేకుండా రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. పలుచోట్ల రాత్రిళ్లు చలి మంటలు, ఉదయం పూట పొగ మంచు దృశ్యాలే కనిపిస్తున్నాయి. రెండు మూడు రోజులుగా రాష్ట్రంపై మంచుదుప్పటి పరుచుకున్నట్లు వాతావరణం మారింది. రాత్రిపూటే కాకుండా మిట్ట…
- మాజీ MLA వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధం …మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదు కృష్ణాజిల్లా గన్నవరంలోని వీరవల్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. గత ప్రభుత్వంలో వైసీపీ నేతల దౌర్జన్య కాండకు టీడీపీ నేత మాదాల శ్రీనివాసరావు నష్టపోయారని ఫిర్యాదులో తెలిపారు. తన…
- ప్రకృతి ప్రేమికులతో నిండిపోయిన … తుర్కం చెరువునిర్మల్ జిల్లాలోని పురాతన చెరువైన తుర్కం చెరువు వద్ద ప్రకృతి ప్రేమికుల సందడి నెలకొంది. మామడ మండలంలోని పొనకల్ గ్రామ శివారులో గల తుర్కమ్ చెరువు బర్డ్స్ ఫెస్టివల్ కు వేదిక అయ్యింది. 1913 లో నిర్మించబడిన ఈ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి