సాతాఫ్రికాతో 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నేడు ఇండియా రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టుతో తలపడనుంది. డర్బన్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో సంజు శాంసన్ 50 బంతుల్లో 107 పరుగులు చేసి రాణించడంతో టీమిండియా 61 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ చెరో మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో ‘కీ’ రోల్ పోషించారు. అయితే తొలి మ్యాచ్‌లో టాప్ ఆర్డర్ భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలమైంది.
మరో వైపు సౌతాఫ్రికా కీలకమైన ఆటగాళ్లు క్వింటన్ డికాక్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే మరియు తబ్రేజ్ షంషీ లేకపోవడంతో ఇబ్బందులు పడింది. ఫామ్ లేమితో బాధపడుతున్న సాతాఫ్రికా జట్టు వెస్టీండిస్‌తో సిరీస్ కోల్పోవడంతో పాటు ఐర్లాండ్‌తో సిరీస్‌ను డ్రా చేసుకుంది. సౌతాఫ్రికా జట్టు రెండో టీ20లో గెలవాలంటే సీనియర్లు మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్ రాణించాల్సిందే. టీంఇండియాలో ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్‌లో వరుసగా తడపడటం ఇబ్బందిగా మారింది. అందివచ్చిన అవకాశాలను భారీ స్కోర్లు మలచడంలో ఈ ఓపెనర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ విఫలం అవుతున్నాడు. అయితే తొలి మ్యాచ్‌లో తిలక్ వర్మ వేగంగా 33 పరుగులు చేసి రాణించాడు.
సూర్య కుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా వంటి ఆటగాళ్లతో కూడిన మిడిల్ ఆర్డర్ మంచి ఆరంభం లభించిన తర్వాత తడబడింది. దీంతో భారత్ కేవలం 36 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఒక్క సారిగా మిడిల్ ఆర్డర్ లోయర్ ఆర్డర్ కుప్పకూలడంతో ప్రశ్నలు తలెత్తాయి. ఇండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ తలో మూడు వికెట్లు రాబట్టి సౌతాఫ్రికాను 141 పరుగుల వద్ద నిలువరించడంలో కీలక పాత్ర పోషించడం భారత్‌కు అనుకూలంగా మారింది. అర్షదీప్, ఆవేశ్ ఖాన్ బంతితో సౌతాఫ్రికా బ్యాటర్లను ఇబ్బంది పెట్టి స్ట్రాంగ్ పర్ఫామెన్స్ ఇచ్చారు. దీంతో రెండవ టీ20లో ఎలాగైనా గెలవాలని టీమిండియా భావిస్తోంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- విజయవాడలో పర్యటించిన మంత్రి సత్యకుమార్ యాదవ్.ప్రజా ఆరోగ్యానికి రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత నిస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. విజయవాడ హనుమాన్‌పేటలో ఉన్న ‘డ్రగ్స్ కంట్రోల్ భవన్’ను, ప్రారంభించిన మంత్రి..చంద్రబాబు దార్శనికతతో ఆరోగ్యాంధ్రప్రదేశ్ విజన్‌కు అనుగుణంగా ఆరోగ్యశాఖ పని చేస్తుందన్నారు. విజయవాడ హనుమాన్‌పేటలో డ్రగ్స్ కంట్రోల్…
- ప్రజా రవాణా. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట.రాష్ట్రవ్యాప్తంగా ప్రజా రవాణా. మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటించారు. నియోజకవర్గ ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అత్యంత కీలకమైన ఈదరపల్లి…
- అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో కూటమి రెండేళ్ల విజయోత్సవ వేడుకలు.అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. నక్కపల్లి మండలం దొడ్డిగల్లు జంక్షన్ నుంచి వేంపాడు టోల్‌ప్లాజా వరకు కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో…
- అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్’పై ఆకస్మిక తనిఖీలు.భాగ్యనగరంలో కల్తీగాళ్ల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అపరిశుభ్రత వాతావరణంలో వంటలు చేస్తూ..ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు. జుగుప్సాకరంగా కన్పించే దృశ్యాలు చూస్తే..కడుపులో పేగులు బయటపడాల్సిందే..కానీ అవేమీ చూడకుండా పాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఆరగిస్తే..అంతే సంగతులు..ఈ విషయమై అప్రమత్తమైన ఫుడ్…
- శరవేగంగా వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు.దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఆధునిక యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పనులను వేగవంతం చేశారు. ప్రభుత్వ విప్, వేములవాడ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 150617