తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తీరు పట్ల మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. తెలంగాణలో బుల్డోజర్ పాలన కొనసాగిస్తున్నారని మావోలు మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తోందని, కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కార్పొరేట్ల ప్రయోజనాల కోసం మాత్రం దూకుడుగా పనిచేస్తోందని మావోయిస్టు పార్టీ విమర్శించింది. మావోయిస్టు పార్టీ తన లేఖలో హైడ్రా, మూసీ సుందరీకరణ అంశాలను, ఇటీవల కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో జరిగిన సంఘటనను ప్రస్తావించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదలైంది. లగచర్లలో ఫార్మాసిటీని నిర్మించి, ప్రకృతి వనరులతో పాటు రైతుల పంట భూములను కొల్లగొట్టడానికి పథకం పన్నారని ఆరోపించారు. భూములు కోల్పోతున్న రైతులు జీవన్మరణ పోరాటంలో భాగంగా మిలిటెంట్ ఉద్యమం చేపట్టారని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్పొరేట్ల నమ్మినబంటునని నిరూపించుకోవడానికి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాడని విమర్శించారు. కార్పొరేట్ల పెట్టుబడులలో వాటా, భారీ మొత్తంలో కమీషన్లు పొందుతున్నాడని ఆరోపించారు. ప్రజలు అనాగరిక బుల్డోజర్ దాడులను వ్యతిరేకించాలని, దామగుండంలో రాడార్ స్టేషన్ ను, లగచర్లలో ఫార్మాసిటీని వ్యతిరేకించాలని… ఈ క్రమంలో వీరోచిత మిలిటెంట్ ఉద్యమాలు చేపట్టాలని తమ లేఖలో పిలుపునిచ్చారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఆధిపత్యం కోసం బీఆర్ఎస్ పాకులాటరాష్ట్రంలో ఆధిపత్యం కోసం బీఆర్ఎస్ , బీజేపీ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయం వ్యవసాయశాఖా మంత్రి తుమ్మల ధ్వజమెత్తారు. దేశంలోనే రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి సాధించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. రాష్ట్రంలో 40 లక్షల ఎకరాల్లో రైతులు సన్న…
- తెలంగాణ కాంగ్రెస్ కు లగచర్ల ఫార్మాసిటీ పై మావోయిస్టుల లేఖతెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తీరు పట్ల మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. తెలంగాణలో బుల్డోజర్ పాలన కొనసాగిస్తున్నారని మావోలు మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తోందని, కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కార్పొరేట్ల…
- ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్కర్మ ఎంత బలంగా ఉంటుందో చెప్పడానికి రఘురామ ఉదంతమే నిదర్శనం అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. రఘురామ ముందుకు వైసీపీ నేతలు రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని, ప్రజాస్వామ్యం…
- వైసీపీ కి గుడ్ బై చెప్పిన మాజీ సలహాదారు S రాజీవ్ కృష్ణతూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, వైసీపీ ప్రభుత్వంలో మాజీ సలహాదారుగా పనిచేసిన ఎస్.రాజీవ్ కృష్ణ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు. ఉండవల్లి నివాసంలో రాజీవ్…
- ముగిసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విచారణఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విచారణ ముగిసింది. జూబ్లీహిల్స్ పోలీసులు ఆయన్ను సుదీర్ఘంగా విచారించారు. విచారణ అనంతరం పోలీస్ స్టేషన్ ఎదుట మీడియాతో మాట్లాడారు. పోలీసులు అడిగిన ప్రశ్నలు అన్నింటికీ సమాధానం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి