తొలిసారి నైజీరియా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీకి ఆ దేశంలో అరుదైన గౌరవం దక్కింది. మోడీ ఖాతాలోకి నైజీరియా అతున్నత పురస్కారం మోడీ ఖాతాలోకి నైజీరియా అతున్నత పురస్కారం. నైజీరియా రెండో అత్యున్నత పురస్కారం అయిన ‘గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైగర్’ అవార్డుతో ఆ దేశం మోదీని సత్కరించింది. ఈ అవార్డును ఆదివారం మోదీకి అందజేసింది. నైజీరియన్లు కాకుండా.. 1969లో క్వీన్ ఎలిజబెత్ తర్వాత ఈ అవార్డును అందుకున్న రెండో విదేశీ వ్యక్తి మోదీనే కావడం విశేషం. ఈ అవార్డును తనకు అందజేసిన నైజీరియా ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డును 140 కోట్ల భారతదేశ ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. విదేశాల్లో మోదీ అందుకున్న అత్యున్నత అంతర్జాతీయ అవార్డుల్లో ఇది 17వ పురస్కారం. ఆ దేశాధ్యక్షుడు బోలా అహ్మద్ తినూబూ ఆహ్వానం మేరకు ఆదివారం నైజీరియా చేరుకున్న మోదీకి అక్కడ ఘన స్వాగతం లభించింది.
నైజీరియా ప్రధానమంత్రి నెసోమ్ ఎజెన్వో ఎయిర్‌పోర్టుకు చేరుకుని మోదీని అబుజా నగరంలోకి ఆహ్వానిస్తున్నట్లు సంకేతంగా ఓ తాళాన్ని అందజేశారు. ఓ వ్యక్తిపై నమ్మకం, గౌరవానికి సూచికగా నైజీరియన్లు ఆ తాళాన్ని అందజేస్తారని భారత విదేశీ వ్యవహారాలశాఖ ఎక్స్‌లో పేర్కొంది. అనంతరం ఆ దేశాధ్యక్ష భవనానికి చేరుకున్న మోదీ నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ తినుబూతో సమావేశమై ఇరు దేశాల మధ్య బంధం మరింత బలోపేతమయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. నైజీరియా పర్యటన అనంతరం జీ- 20 సదస్సులో పాల్గొనేందుకు మోదీ బ్రెజిల్ వెళ్లనున్నారు. అటు నుంచి గయానా వెళ్లి భారత్‌కు తిరిగి రానున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- తెలంగాణలో పొన్నం కొత్త పాలసీతెలంగాణలో సోమవారం నుంచి నూతన ఎలక్ట్రిక్ వెహికిల్స్ పాలసీ అమలులోకి రానుందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ మేరకు కొత్త పాలసీ వివరాలు ప్రకటించారు. రాష్ట్రంలో ఇకపై కొనుగోలు చేసే అన్ని ఈవీ వాహనాలకు రిజిస్ట్రేషన్…
- మోడీ ఖాతాలోకి నైజీరియా అతున్నత పురస్కారంతొలిసారి నైజీరియా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీకి ఆ దేశంలో అరుదైన గౌరవం దక్కింది. మోడీ ఖాతాలోకి నైజీరియా అతున్నత పురస్కారం మోడీ ఖాతాలోకి నైజీరియా అతున్నత పురస్కారం. నైజీరియా రెండో అత్యున్నత పురస్కారం అయిన ‘గ్రాండ్ కమాండర్…
- జార్ఖండ్ లో బీజేపీ VS కాంగ్రెస్ మధ్య సోషల్ మీడియా వార్జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ, కాంగ్రెస్ మధ్య వాడివేడి సోషల్ మీడియా వార్ నడుస్తోంది. జార్ఖండ్ బీజేపీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్ చేస్తున్న వీడియోలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఈ అంశంపై…
- ఫొటో షూట్ కోసమే బీజేపీ మూసీ నిద్రతెలంగాణ బీజేపీ తలపెట్టిన మూసీ పరివాహక ప్రాంతాల పర్యటనపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. మూసీ ప్రాజెక్టు ఆపేందుకు బీజేపీ, BRS కుమ్మక్కై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిఫొటో…
- మిడ్ మానేరు భూబాధితులను రోడ్డున పడేసిన కేసీఆర్రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు నిర్వాసితులకు ఇందిరమ్మ పథకం కింద 4 వేల 696 కుటుంబాలకు ఇళ్ల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించిన మంత్రి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి