మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకెళుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి ఏకంగా 194 స్థానాల్లో కూటమి అభ్యర్థులు లీడ్ లో కొనసాగుతున్నారు. బీజేపీ సింగిల్ గానే వంద స్థానాలకు పైగా గెలుచుకునే ట్రెండ్ కనిపిస్తోంది. దీంతో మహారాష్ట్రలో మరోసారి మహాయుతి ప్రభుత్వమే ఏర్పడనుందని తేలిపోయింది. అయితే, కూటమిలో ముఖ్యమంత్రి సీటు కోసం నేతల మధ్య పోటీ నెలకొంది. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన చీఫ్, ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ లతో పాటు పలువురు ఇతర కీలక నేతలు కుర్చీ కోసం అంతర్గతంగా డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయా పార్టీల్లో కిందిస్థాయి నేతలు తమ నేతే కాబోయే సీఎం అంటూ జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. అజిత్ పవార్ పార్టీ నేతలైతే ఓ అడుగు ముందుకు వేసి మహారాష్ట్ర సీఎం అజిత్ పవార్ అంటూ పోస్టర్లు కూడా పలు సిటీల్లో అతికించారు. దీనిపై బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ స్పందిస్తూ.. ఫలితాలు వెలువడ్డాక కూటమి నేతలంతా కూర్చుని ముఖ్యమంత్రిని ఎన్నుకుంటామని వివరణ ఇచ్చారు. వెలువడుతున్న ఎన్నికల ఫలితాల్లో ఏక్ నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ సహా ఎన్డీయే కూటమికి చెందిన కీలక నేతలంతా లీడ్ లో కొనసాగుతున్నారు. బారామతిలో పవార్ కుటుంబ పోటీలో అజిత్ ముందున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
- పల్లె, పట్నం తేడా లేకుండా వణికిస్తున్న చలిపల్లె పట్నం తేడా లేకుండా రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. పలుచోట్ల రాత్రిళ్లు చలి మంటలు, ఉదయం పూట పొగ మంచు దృశ్యాలే కనిపిస్తున్నాయి. రెండు మూడు రోజులుగా రాష్ట్రంపై మంచుదుప్పటి పరుచుకున్నట్లు వాతావరణం మారింది. రాత్రిపూటే కాకుండా మిట్ట…
- మాజీ MLA వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధం …మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదు కృష్ణాజిల్లా గన్నవరంలోని వీరవల్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. గత ప్రభుత్వంలో వైసీపీ నేతల దౌర్జన్య కాండకు టీడీపీ నేత మాదాల శ్రీనివాసరావు నష్టపోయారని ఫిర్యాదులో తెలిపారు. తన…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి