పంజాబ్ కు చెందిన ఓ జంట తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని పంజాబ్-హర్యానా హైకోర్టు మెట్లు ఎక్కింది. అయితే కోర్టులో మాత్రం ఊహించని పరిణామం ఎదురైంది. పంజాబ్ కు చెందిన ఓ పురుషుడు, మహిళ కొంతకాలంగా కలిసి ఉంటున్నారు. అతడికి పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భార్య నుంచి విడిగా ఉంటున్నాడు. అతడితో కలిసున్న మహిళకు ఇంకా పెళ్లి కాలేదు. అయితే, కలిసి జీవిస్తున్న వారిద్దరూ పంజాబ్-హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. మహిళ కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. కాని జస్టిస్ కుల్దీప్ తివారీ ఏకసభ్య ధర్మాసనం నుంచి ఊహించని వ్యాఖ్యలు ఎదురయ్యాయి. ఇక ఈ కేసులో పురుషుడు ఇంకా భార్య నుంచి విడాకులు తీసుకోలేదు. విడాకులు తీసుకోకుండా మరో మహిళతో కలిసి ఉంటే దాన్ని సహజీవనం అనరు అన్నారు. మరో మహిళతో కామంతో కూడిన వ్యభిచారం చేస్తున్నాడు అంటారు. సెక్షన్ 494/495 కింది ఇది నేరమని, దీనికి శిక్ష కూడా ఉంటుందని ధర్మాసనం తేలిపింది. వ్యభిచారం కేసులో శిక్ష నుంచి తప్పించుకోవడానికి సహజీవనం అంటూ ఈ పిటిషన్ వేసినట్టుంది” అంటూ జస్టిస్ కుల్దీప్ తివారీ మొట్టికాయలు వేశారు.
హైకోర్టు ఎక్కిన ఓ జంట
90
previous post