నరేంద్ర మోడీ అధ్యక్షతన ఎన్డీయే భాగస్వామ్య పక్షాల కీలక సమావేశం ..

Advertisements

<p>తాజా రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు ఇవాళ ఉదయం 11&colon;30 గంటలకు కేంద్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశం కానున్నట్లు అధికార వర్గాల సమాచారం&period; మహిళా రిజర్వేషన్లు&comma; నియోజకవర్గాల పునర్విభజన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ప్రతిష్టాత్మక బిల్లు&comma; కావాల్సిన మెజార్టీ సాధించలేకపోయింది&period; ఈ బిల్లు వీగిపోయిన వెంటనే అధికార పక్షం తదుపరి వ్యూహరచనలో పడింది&period; లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును విపక్షాలు అడ్డుకోవడంపై అధికార ఎన్డీయే కూటమి తీవ్రంగా స్పందించింది&period; బిల్లు వీగిపోయిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఎన్డీయే భాగస్వామ్య పక్షాల కీలక సమావేశం జరిగింది&period; ఈ సందర్భంగా విపక్షాల తీరును నిరసిస్తూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని కూటమి ఏకగ్రీవంగా నిర్ణయించింది&period; మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చారిత్రక అవకాశాన్ని విపక్షాలు కాలరాశాయని ఎన్డీయే నేతలు మండిపడ్డారు&period; ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు&period; మహిళా సాధికారతకు విపక్షాలు మొదటి నుంచీ అడ్డుపడుతున్నాయి&period; నేడు వారి మహిళా వ్యతిరేక మైండ్‌సెట్ దేశం ముందు బట్టబయలైంది అని ప్రధాని మోడీ ఈ సమావేశంలో వ్యాఖ్యానించినట్లు సమాచారం&period; మహిళా బిల్లుకు తాము అనుకూలమని చెబుతూనే&comma; డీలిమిటేషన్ సాకుతో ఓటింగ్‌లో వ్యతిరేకించిన &&num;8216&semi;ఇండియా&&num;8217&semi; కూటమి ద్వంద్వ నీతిని ఎండగట్టాలని ఎన్డీయే తీర్మానించింది&period; ఈ ఆందోళనల్లో బీజేపీ మహిళా మోర్చా సహా భాగస్వామ్య పక్షాల మహిళా విభాగాలను చురుగ్గా పాల్గొనేలా కార్యాచరణ రూపొందించినట్టు తెలుస్తుంది<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌లో వ్యక్తిగత పర్యటనలో టిఫానీ ట్రంప్‌..

సీబీఎస్‌ఈ రీవాల్యుయేషన్‌ పోర్టల్‌పై సైబర్‌ దాడి..

కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్..