బైకును ఢీకొని 30 కిలోమీటర్లు ఈడ్చుకుని వెళ్లిన ఘటన ఏలూరు జిల్లా కోయిలగూడెంలో చోటు చేసుకుంది. దేవరపల్లి తల్లాడ జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని వెనకనుంచి లారీ ఢీకొట్టింది. అనంతరం సుమారు 20కి.మీ వరకు బైక్ను ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో లారీ కింద ఇరుక్కున్న బైక్ తుక్కు తుక్కుగా మారింది. ఆదివారం రాత్రి కొంతమంది తమ ద్విచక్ర వాహనాలను కొయ్యలగూడెం వద్ద జాతీయ రహదారి పక్కన ఓ హోటల్ దగ్గర నిలిపారు. ఆ సమయంలో అటువైపు వేగంగా వచ్చిన లారీ.. ద్విచక్ర వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ వాహన దారుడికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ క్రమంలో ఓ ద్విచక్ర వాహనాన్ని లారీ అలాగే ఈడ్చుకెళ్లింది. కొయ్యలగూడెం పోలీసులు ఇచ్చిన సమాచారంతో తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి పోలీసులు అప్రమత్తమయ్యారు. కొయ్యలగూడెం నుంచి దాదాపు 20కి.మీ దూరంలోని దేవరపల్లి డైమండ్ జంక్షన్ వద్ద పోలీసులు లారీని అడ్డగించి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
జాతీయ రహదారిపై బైకును ఢీ కొట్టిన లారీ..
249
previous post