కరోనా గురించి యావత్ ప్రపంచం మరిచిపోతున్న తరుణంలో మళ్లీ కరోనా భూతం బెంబేలెత్తిస్తోంది. కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 కలవరపెడుతోంది. మన దేశంలో కూడా కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 358 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కరోనా కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ మూడు మరణాలు కూడా కేరళలో సంభవించాయి. కొవిడ్ సబ్ వేరియంట్ జేఎన్.1ను తొలుత కేరళలో గుర్తించారు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే గత 24 గంటల్లో కొత్తగా 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ హైదరాబాద్ లోనే నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతం 14 మంది కొవిడ్ చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఏపీలో కూడా కొత్త వేరియంట్ కేసులు నమోదయినట్టు సమాచారం. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. కరోనా కట్టడికి అన్ని చర్యలను చేపట్టాలని అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. ఇప్పటికే పలు రాష్ట్రాలు మాస్క్ లు ధరించాలని ప్రజలకు సూచించాయి. వృద్ధులు, గర్భిణులు చిన్నారులు, వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడే వారు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. గుంపుగా ఉన్న వారి వద్దకు వెళ్లకుండా ఉండటమే మంచిదని అంటున్నారు. చేతులు శుభ్రంగా కడుక్కోవడంతో పాటు శానిటైజర్ అందుబాటులో ఉంచుకోవాలి. జ్వరం తగ్గకపోవవడం, విపరీతమైన దగ్గు, జలుబు, ముక్కు నుంచి నీరు కారడం ఊపిరి సరిగా ఆడకపోవడం తదితర సమస్యలను ఎదుర్కొంటున్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలి. పోషక విలువలు గల వేడి ఆహారాన్ని తీసుకోవాలి. చిన్న పిల్లలు, వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న వారు అప్రమత్తంగా ఉండాలి. తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఫీవర్ ఆస్పత్రికి వచ్చి వైద్యులను సంప్రదించి మెరుగైన వైద్యం పొందవచ్చు.
దేశంలో మళ్లీ కలవరపెడుతునన్న కొత్త కరోనా
87
previous post