తమ దేశంలో కొత్త వైరస్లు ఏవీ లేవని చైనా ప్రభుత్వం పేర్కొన్నట్టు ప్రపంచఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తాజాగా వెల్లడించింది. చైనా స్కూలు విద్యార్థులు ఓ గుర్తు తెలియని నిమోనియా తరహా వ్యాధి బారినపడుతున్న కేసులు పెరుగుతున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. చైనా ఉత్తర భాగాన ఉన్నప్రాంతాల్లో నిమోనియా తరహా వ్యాధి ప్రబలుతోంది. ఆసుపత్రుల్లో చిన్నారుల చేరిక నానాటికీ పెరుగుతూ అక్కడి ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి పెంచుతోంది. కరోనా సంక్షోభం తొలినాళ్లను గుర్తుకు తెస్తున్న తాజాగా పరిస్థితులపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్త వైరస్ పుట్టుకొచ్చిందన్న ఊహాగాలు బయలుదేరాయి. అక్టోబర్ మధ్య నుంచి చైనా ఉత్తర ప్రాంతాల్లో ఊపిరితిత్తుల వ్యాధి బారిన పడే చిన్నారుల సంఖ్య పెరుగుతోంది. ఈ వ్యాధికి సంబంధించి చైనా ప్రభుత్వాన్ని మరిన్ని వివరాలు ఇవ్వమని తాము కోరినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. చైనా అంటువ్యాధుల నియంత్రణ సంస్థతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించామని వెల్లడించింది. ఆసుత్రుల సామర్థ్యాలకు మించి రోగుల చేరికలు లేవని చైనా అధికారులు తెలిపినట్టు వెల్లడించింది. పరిస్థితిని నిశితంగా సమీక్షిస్తున్నామని చైనా అధికారులతో టచ్లో ఉన్నామని పేర్కొంది. అయితే, చైనా ప్రభుత్వం మాత్రం డబ్ల్యూహెచ్ఓ ప్రకటనపై బహిరంగంగా స్పందించలేదు.
Read Also..