కాపులను గుర్తించని పార్టీ కనుమరుగవ్వడం ఖాయమని గుంటూరు జిల్లా కాపు సంఘ నాయకులూ హెచ్చరించారు. సోమవారం నగరంలోని ఓ హోటల్ లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాపు జెఎసి అధ్యక్షులు అమ్మ శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ కాపులను గుర్తించని పార్టీ కనుమరుగవ్వడం ఖాయమని, గుర్తుంచుకున్న పార్టీలకు కాపులు అండగా ఉంటారన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 4 అసెంబ్లీ స్థానాలు, 1 పార్లమెంట్ స్థానాలు కాపులకు కేటాయించాలని డిమాండు చేశారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలో 1 పార్లమెంట్ 2 అసెంబ్లీ స్థానాలను కేటాయించాలన్నారు. 27 శాతం ఉన్న కాపులు రాష్టంలో నిర్ణయాత్మకంగా ఉన్నారని పేర్కొన్నారు. జనాభా దామాషా ప్రకారం కాపులకు తగిన సీట్లను అన్ని రాజకీయ పార్టీలు రాష్టంలో కేటాయించాలన్నారు. ఎన్నికల ముందు అలివికాని హామీలు ఇచ్చి కాపులను మోసం చేయొద్దని వారు హెచ్చరించారు. రాష్ట్ర కాపునాడు ఉపాధ్యక్షులు యర్రగోపు నాగేశ్వరావు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కాపులకు అత్యధిక సీట్లు కేటాయించిన పార్టీకే మా మద్దతు అని అన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్నాం. జిల్లా కాపునాడు అధ్యక్షులు మిరియాల గోపి కాపులకు ఏ పార్టీ సరైన గుర్తింపు ఇవ్వటం లేదన్నారు. గుర్తింపు ఉన్న పార్టీ అధికారం లో లేదని, అధికారంలో ఉన్న పార్టీ గుర్తించడం లేదన్నారు. రాష్టంలో ఏ పార్టీ అయిన గెలిచే ప్రాంతాల్లో కాపులకు సీట్లు కేటాయించాలన్నారు. రాష్ట్ర కాపు మహిళా నాయకురాలు పాకనాటి రమాదేవి మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో 6 లక్షల మంది కాపులు ఉన్నారు. కాపులను గుర్తించిన పార్టీని భుజాన పెట్టుకుంటాం. గతంలో కాపులను నమ్మించి మోసం చేసిన పార్టీలు కనుమరుగయ్యాయన్నారు. బిట్రగుంట మల్లికా మాట్లాడుతూ కాపులు అత్యధికంగా ఉన్న ప్రాంతాలల్లో కాపుల ఓట్లను తొలగిస్తున్నారని పేర్కొన్నారు. రాజ్యాధికార దిశగా రాష్టంలో ఉన్న అన్ని కాపు సంఘాలు కాపు నాయకుల కలిసి పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రకాపు సంక్షేమ సేన జాయింట్ సెక్రటరీ వెలిదండి కోటేశ్వర రావు, పివిఆర్ కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మి నారాయణ, కాపునాడు జిల్లా ప్రధాన కార్యదర్శి రాగం సదాశివరావు, కాపునాడు గుంటూరు తూర్పు నియోజకవర్గ అధ్యక్షులు బండి రామప్రభు, తెలగ అభ్యుదయ సంఘ కార్యదర్శి డేగల వెంకటేశ్వర రావు, అఖిల భారత కాపు సమాఖ్య ఉపాధ్యక్షులు బొక్కిసం శివరాం, అఖిల భారత కాపు సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి మేకల బాబు రావు, మెల్లం సైదయ్య, బొబిలి రామారావు, చింతకాయల రామారావు, కలగంటి త్రిపుర సుందరావు తదితరులు పాల్గొన్నారు.
కాపులను గుర్తించని పార్టీ కనుమరుగవ్వడం ఖాయం..
68
previous post