67
పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయ రమణారావు 55 వేల 108 ఓట్ల భారీ మెజార్టీతో తన ప్రత్యర్థి భారాస నేత దాసరి మనోహర్ రెడ్డి పై విజయం సాధించాడు. ఈ మేరకు ఉదయం 8 గంటల మంథనిలోని జెఎన్టియు కళాశాలలో అధికారులు ఓట్లు లెక్కింపు చేపట్టారు. కాంగ్రెస్ అభ్యర్థి చింతకుంట విజయ రమణారావు మొదటి రౌండ్ నుంచే తన ఆదిఖ్యం చివరి వరకు కొనసాగింది. ఆరు గ్యారెంటీలతో పెద్దపల్లి నియోజకవర్గం లో విజయ రమణారావు అలుపెరుగని ప్రచారం చేయగా ప్రజలు ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి పట్టం కట్టారు. ప్రజలు తనపై నమ్మకం ఉంచి ఓట్లు వేసినందుకు భవిష్యత్తులో వారి రుణం తీర్చుకుంటామని, అలాగే పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి కూడా పాటుపడతానని హామీ ఇచ్చారు.
Read Also..