విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో ఇంట్లో అగ్నిప్రమాదం – భారీ ఆస్తి నష్టం.

విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో ఇంట్లో అగ్నిప్రమాదం – భారీ ఆస్తి నష్టం

Advertisements

<p>మహబూబాబాద్ జిల్లా&comma; కొత్తగూడ మండలం&comma; బొత్తవానిగూడెం&colon;<&sol;p>&NewLine;<p>కొత్తగూడ మండలంలోని బొత్తవానిగూడెం గ్రామంలో సోమవారం అర్ధరాత్రి విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది&period; గ్రామానికి చెందిన కుంజ నర్సమ్మ ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇంటి అంతటా వ్యాపించాయి&period;<&sol;p>&NewLine;<p>ఇంట్లో నుంచి మంటలు ఎగసిపడుతుండటాన్ని గమనించిన గ్రామస్తులు వెంటనే అప్రమత్తమై సంఘటనా స్థలానికి చేరుకుని&comma; తీవ్ర శ్రమతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు&period; గ్రామస్తుల సకాలంలో స్పందనతో మంటలు సమీప ఇళ్లకు వ్యాపించకుండా అడ్డుకోవడంతో గ్రామానికి పెను ప్రమాదం తప్పింది&period;<&sol;p>&NewLine;<p>ఈ ఘటనలో ఇంట్లో ఉన్న గృహోపకరణాలు&comma; కలప సామగ్రి&comma; ఇతర విలువైన వస్తువులు పూర్తిగా దగ్ధమై భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం&period; అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో కుటుంబ సభ్యులు&comma; గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు&period;<&sol;p>&NewLine;<p>అగ్నిప్రమాదంతో తీవ్రంగా నష్టపోయిన కుంజ నర్సమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకుని తగిన ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు&comma; స్థానిక ప్రజాప్రతినిధులు కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.