రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మరీ జిల్లాలో సంచలనం రేపిన నలుగురి హత్య కేసు..

రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మరీ జిల్లాలో సంచలనం రేపిన నలుగురి హత్య కేసు

Advertisements

<p>అర్ధరాత్రి వేళ నిర్మానుష్య ప్రాంతంలో మంటల్లో చిక్కుకున్న ఓ కారు… మొదట అది సాధారణ ప్రమాదంగా కనిపించింది&period; కానీ&comma; కాసేపటికే బయటపడిన నిజాలు పోలీసులను సైతం షాక్‌కు గురిచేశాయి&period; రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ జిల్లా సమీపంలో మాజీ సర్పంచ్‌తో పాటు నలుగురిని దారుణంగా హత్య చేసి&comma; ఆనవాళ్లు చెరిపివేయడానికి కారుతో సహా మృతదేహాలకు నిప్పంటించిన ఘటన సంచలనం రేపుతోంది&period;<br &sol;>&NewLine;ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు తొలుత షార్ట్ సర్క్యూట్ కారణంగా కారు అగ్నికి ఆహుతైందని భావించారు&period; ప్రమాద వార్త తెలుసుకుని మాజీ సర్పంచ్ రామ్‌సింగ్ చౌదరి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు&period; మృతుడి మొదటి భార్య సూర్యజియం దేవి&comma; కుమారుడు డెడ్‌బాడీలను చూసి విలపించగా&period;&period; అక్కడి గ్రామస్థులు&comma; పోలీసులు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు&period;<br &sol;>&NewLine;అయితే&comma; ఘటనాస్థలంలో లభించిన ఆధారాలు&comma; మృతదేహాల పరిస్థితిని పరిశీలించిన తర్వాత ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అని పోలీసులు తేల్చారు&period; దర్యాప్తులో మాజీ సర్పంచ్ రామ్‌సింగ్ చౌదరికి కుటుంబ కలహాలు&comma; ఆస్తి వివాదాలు ఉన్నట్లు బయటపడింది&period; ఈ నేపథ్యంలోనే ఆయనతో పాటు మరో ముగ్గురిని వేరే చోట హత్య చేసి&comma; అనంతరం మృతదేహాలను కారులో ఉంచి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తగలబెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు&period;<br &sol;>&NewLine;ఈ కేసులో కీలక ఆధారాలు లభించడంతో మృతుడి మొదటి భార్య సూర్యజియం దేవి&comma; కుమారుడు&comma; కోడలిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు&period; ఈ హత్యల్లో మరెవరైనా పాల్గొన్నారా&quest; సుపారీ గ్యాంగ్ సహాయం ఉందా&quest; అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది&period; రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించి పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఎల్ఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనురాగ్ అధర్వ రాజు దర్శకత్వంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన చిత్రం “లఫూట్ గ్యాంగ్”..

ది రెడ్ బ్యాగ్’ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్..

పెద్దపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన..