ఈత సరదా అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి..

ఈత సరదా అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి

Advertisements

<p>అమెరికాలోని లూసియానాలో విషాద ఘటన చోటుచేసుకుంది&period; తెలంగాణవాసి అనురూప్‌ రెడ్డి &period;&period;ముగ్గురు స్నేహితులను కాపాడి&period;&period;అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయాడు&period; సరదాగా ముగ్గురు స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు లూసియానాలోని టొరోడో పార్క్‌లోని సెబాన్ రివర్‌లోకి కోడూరు అనురూప్ రెడ్డి వెళ్లాడు&period; హఠాత్తుగా స్నేహితులు ముగ్గురూ లోతు ప్రదేశంలోకి వెళ్లి &&num;8216&semi;రక్షించండి&&num;8217&semi; అంటూ కేకలు వేయడంతో అనురూప్ రెడ్డి ఒక్కొక్కరిని పైకి లాగుతూ ఓడ్డుకు చేర్చాడు&period; కానీ&&num;8230&semi; అనూహ్యంగా అనురూపు రెడ్డి పైకి వచ్చే క్రమంలో ఫిషింగ్ వైర్ కాలికి చుట్టుకుని పైకి రావడం కష్టంగా మారింది&period; ఒడ్డున ఉన్న స్నేహితులు&comma; ఈతగాళ్లు అనూప్ రెడ్డిని ఒడ్డుకు తీసి&period;&period; స్థానిక ఆసుపత్రికి తరలించారు&period; అనురూప్‌రెడ్డి అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధరించారు&period; టీం ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ&comma; ఇండియన్ ఎంబసీ&comma; లూసియానా కాన్సోలేట్ లుక్ సహకారంతో మరో వారం రోజుల్లో అతని మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు&period; అనూప్ రెడ్డి ప్రమాదవశాత్తు చనిపోయాడా&quest; మరేమైనా కారణాలు ఉన్నాయా&quest; అనేది లూసియానా పోలీసుల దర్యాప్తు తర్వాత తేలనుంది&period;<&sol;p>&NewLine;<p>హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కావడిపల్లి గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజేందర్ రెడ్డి&comma; దుర్గ భవాని దంపతులకు అనురూప్‌రెడ్డి రెండో సంతానం&period; మొదటి కుమారుడు ఆశ్రీత్ రెడ్డితో పాటు అనురూప్‌రెడ్డి సైతం ఐదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లారు&period; యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్‌ గ్రాడ్యుయేషన్‌ ఇటీవల పూర్తి చేశారు&period; జూన్ నుంచి ఉద్యోగ అన్వేషణ చేయాల్సిన క్రమంలో&period;&period; ఇలా విగతా జీవిగా చూస్తామని అనుకోలేదని అతని కుటుంబం&comma; సన్నిహితులు కన్నీటి పర్యంతమయ్యారు&period; అనురూప్‌రెడ్డికి ఫోటోగ్రఫీ ఎంతో ఇష్టం&comma; సామాజిక సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేవాడని అతని సోదరుడు తెలిపారు&period; ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడు స్నేహితుల కోసం తన ప్రాణాలను పణంగా పెట్టడం ప్రతి ఒక్కరినీ కలచివేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.