నల్గొండ జిల్లా చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.

Advertisements

<p>నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం జరిగింది&period; ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారి గుట్టకింద ఈ ఘటన జరిగింది&period; బొమ్మల దుకాణంలో చెలరేగిన మంటలు&period;&period;క్షణాల్లోనే పక్కనే ఉన్న షాపులకు అంటుకున్నాయి&period; ఈ ఘటనలో 10కి పైగా షాపులు అగ్నికి ఆహుతయ్యాయి&period; భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి&period; ప్రమాద తీవ్రతకు రెండు గ్యాస్‌ సిలిండర్లు సైతం పేలినట్లు చెబుతున్నారు స్థానికులు&period; ఘటనాస్థలానికి సమీపంలో ఉన్న గ్రామపంచాయతీ కార్యాలయానికీ మంటలు వ్యాపించాయి&period; దీంతో కార్యాలయంలోని పలు దస్త్రాలు కాలిపోయాయి&period;<&sol;p>&NewLine;<p>సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేస్తున్నారు&period; కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది&period; దుకాణాలు కాలి బూడిదయ్యాయి&period; ఈ ఘటనలో దాదాపు రెండున్న కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు తెలిపారు స్థానిక సర్పంచ్‌&period; పోలీసులు&comma; గ్రామస్థులు&comma; అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు&period; ప్రమాదం జరిగిన సమయంలో దుకాణాల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.