తిరుపతిలో మద్యం మత్తులో లారీ డ్రైవర్ బీభత్సం.

Advertisements

<p>తిరుపతి జిల్లాలో అర్ధరాత్రి వేళ ఓ లారీ డ్రైవర్ మద్యం మత్తులో సృష్టించిన బీభత్సం కలకలం రేపింది&period; చంద్రగిరి మండలం కొంగరివారిపల్లె సమీపంలో లారీ డ్రైవర్ మద్యం మత్తులో కలకలం సృష్టించాడు&period; చిత్తూరు వైపు నుంచి కట్టెల లోడ్‌తో అతివేగంగా తిరుపతి వైపు వస్తున్న లారీ&period;&period; ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది&period; రోడ్డు పక్కనే ఉన్న చెట్టును&comma; అక్కడ ఆగి ఉన్న ఒక కారును బలంగా ఢీకొట్టింది&period; అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న ఒక చిల్లర దుకాణాన్ని కూడా లారీ పూర్తిగా ధ్వంసం చేసింది&period; ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ స్థానికులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణాపాయం తప్పింది&period; ప్రమాదాన్ని గమనించిన స్థానికులు&period;&period; లారీ డ్రైవర్&comma; క్లీనర్‌లను అక్కడికక్కడే పట్టుకుని దేహశుద్ధి చేశారు&period; అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు&period; ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “రణబాలి” మూవీ.

సెమీకాన్‌ ఇండియా-2026 ప్రారంభించిన మోదీ.

జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.