హయత్‌నగర్ శంకర్‌నగర్‌లో కారులో మంటలు.

Advertisements

<p>హైదరాబాద్ హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కారులో మంటలు కలకలం రేపాయి&period;&period; శంకర్‌నగర్‌లో ఇంటి ముందు పార్క్ చేసిన కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి&period; మంటలు భారీగా వ్యాపించడంతో కారు పూర్తిగా దగ్ధమైంది&period; ఈ కారు మాధవరెడ్డికి చెందినదిగా తెలుస్తోంది&period; అయితే కారును ఎవరైనా ఆకతాయిలు కావాలనే తగలబెట్టి ఉంటారనే అనుమానాన్ని కారు యజమాని వ్యక్తం చేస్తున్నారు&period; ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు&period; కారు ఎలా దగ్ధమైందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు&period; శంకర్‌నగర్‌లోని పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు&period; కారు వద్దకు ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు వచ్చారా&period;&period; కావాలనే నిప్పు పెట్టారా అనే విషయాలను సీసీ కెమెరాల ద్వారా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్