లోక్ సభ ఎన్నికల(Lok Sabha elections) సమయంలో తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్ పార్టీ(Congress party)కి షాక్ తగిలింది. కొన్నిరోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరిన పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన కమలం పార్టీలో చేరారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కూడా బీజేపీలో చేరారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
వారికి కిషన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వెంకటేశ్ నేత 2019 లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచారు. ఈసారి బీఆర్ఎస్ కొప్పుల ఈశ్వర్‌కు టిక్కెట్ ఇచ్చింది. ఈ క్రమంలో వెంకటేశ్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ అంతలోనే మళ్లీ ఈరోజు కమలం పార్టీ కండువాను కప్పుకున్నారు. పెద్దపల్లి నుంచి బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్‌ను గెలిపించేందుకు కృషి చేస్తారని కిషన్ రెడ్డి చెప్పారు.
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలుప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల…
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- పల్లె, పట్నం తేడా లేకుండా వణికిస్తున్న చలిపల్లె పట్నం తేడా లేకుండా రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. పలుచోట్ల రాత్రిళ్లు చలి మంటలు, ఉదయం పూట పొగ మంచు దృశ్యాలే కనిపిస్తున్నాయి. రెండు మూడు రోజులుగా రాష్ట్రంపై మంచుదుప్పటి పరుచుకున్నట్లు వాతావరణం మారింది. రాత్రిపూటే కాకుండా మిట్ట…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.