67
గచ్చిబౌలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో విధ్యార్ధి సంఘం ఆధ్వర్యంలో విధ్యార్థులు ఆందోళన చేపట్టారు. ఇటీవల మృతి చెందిన ఔట్ సోర్సింగ్ సిబ్బంది కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేసారు. రెండు రోజుల నుంచి నిరసనలు వ్యక్తం చేసిన స్పందించిన యునివర్సిటీ యాజమాన్యం, దీంతో యునివర్సిటీ ప్రధాన గేటు ముందు విధ్యార్థులు ఆందోళన చేపట్టారు. విధ్యార్థుల ఆందోళనకు యునివర్సిటీ ఔట్ సోర్సింగ్ సిబ్బంది మద్దతు తెలిపారు. సిబ్బందికి న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని విధ్యార్థి సంఘం నాయకులు హెచ్చరించారు.