మనమంతా కాలంతో పాటు పరుగెడుతూ మన చుట్టూ ఎన్నో వింతలు, విశేషాలను చూడలేకపోతున్నాం. చరిత్రకు సజీవ సాక్ష్యాలు ఉన్న వాటి గురించి తెలుసుకోలేకపోతున్నాం. అలాంటి వాటిలో ఈ ఆలయం కూడా ఒకటి. దాదాపు ఏడు వందల ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం ఇది. వందల ఏళ్లైనా చెక్కు చెదరని నిర్మాణాలు దీని సొంతం. ఎక్కడా లేని విధంగా 700 ఏళ్లుగా నిరంతరం వెలుగుతున్న అఖండజ్యోతి ఈ ఆలయం ప్రత్యేకత.నిజాం పాలనలో నిర్విఘ్నంగా పూజలు సాగిన ఆలయం. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో అతి పురాతనమైన సీతారామాలయం.తెలంగాణ ప్రాంతాన్ని అనేక రాజవంశాలు పరిపాలించాయి. వారి పాలనకు గుర్తులుగా ఆయా ప్రాంతాల్లో పలు దేవాలయాలను అప్పటి రాజులు నిర్మించారు. అలాంటి ఆలయంలో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట లోని అతి పురాతనమైన సీతారామాలయం ఒకటి. కాకతీయ పాలకుల కాలంలో దాదాపు క్రీస్తు శకం 1333లో నిర్మితమైన ఈ దేవాలయానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఆలయంలో పురాతన లక్ష్మణ సమేత సీతారాముల మూల విగ్రహంతో పాటు 16 రాతి స్తంభాలతో నిర్మించిన కళ్యాణమంటపం, గంట, తటాకం నాటి ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఆలయంలోని గంటపై ఆలయ నిర్మాణానికి సంబంధించిన సంవత్సరం చెక్కబడి ఉంది. ప్రతాపరుద్రుని కాలంలో నిర్మాణం. ఓరుగల్లును పరిపాలించిన కాకతీయుల రాజ్యంలో కొన్ని గ్రామాలను పాలన పరంగా ప్రత్యేక గుర్తించేవారు. అలా గుర్తించిన వాటిలో గంభీరావుపేట ప్రధాన కేంద్రంగా ఉండేది. అందుకే అక్కడ ప్రత్యేకంగా లక్ష్మణ సమేత సీతారామాలయాన్ని నిర్మించారని చరిత్రకారులు చెబుతారు. కాకతీయ రాజులలో చివరివాడైన ప్రతాపరుద్రుని కాలంలో ఈ సీతారామాలయాన్ని నిర్మించినట్లు ప్రతీతి. నిజాం పాలనలో లింగన్నపేట సంస్థానానికి చెందిన శ్రీ వెంకటరావు దేశాయి సంస్థానాధీశులుగా ఉండేవాడు. ఈ ఆలయం పరిపాలన ఆయన కిందకి రావడంతో సీతారామాలయం అభివృద్దికి కృషి చేసినట్లు స్థానికులు చెబతుంటారు. ఆలయంలో పూజ కార్యక్రమాల కోసం దగ్గర్లోనే వెంకటాద్రి చెరువును నిర్మించారు. ఆ చెరువు నుంచే ఆలయంలో జరిగే ఉత్సవాల అన్నింటికీ నీటిని తెస్తుంటారు. ఇప్పటికీ ఆ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. నిజాం పాలనలో నిర్విఘ్నంగా పూజలు ఆలయంలో నందాదీపం 700 ఏళ్లుగా నిరంతరంగా వెలుగుతూనే ఉంది. మూల విగ్రహాల ప్రతిష్ఠకు ముందే ఆలయంలో నందా దీపంను ప్రతిష్ఠించినట్లు తెలుస్తుంది. నాటి నుంచి నేటి వరకు ఈ దీపం వెలుగుతూనే ఉంది. నిజాం కాలంలో సైతం ఈ ఆలయంలో నిర్విఘ్నంగా పూజలు సాగినట్లు ఆధారాలున్నాయి. ఈ నందా దీపం వెలుగుతుండడం వల్లే గ్రామస్తులు ఐశ్వర్యం, ధాన్యం, సమృద్ధిగా కలుగుతుందని ఇక్కడి ప్రజలకు ప్రగాఢ విశ్వాసం.
700 ఏళ్లుగా వెలుగుతున్న అఖండ జ్యోతి.. ఎక్కడ ఉందో తెలుసా!
89
previous post