తెలంగాణలో పార్టీ ప్రచారం ముగిసింది. మైకులు మూగబోయాయి. చివరి రోజు ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు తమ ప్రచారాన్ని హోరెత్తించారు. రోడ్ షో లతో హడావుడి చేశారు. ఇక ఓటర్ పై భారం వేశారు. సీఎం కేసీఆర్, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక, బీజేపీ తరఫున మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎంలు, కేటీఆర్, హరీశ్ రావు, రేవంత్ రెడ్డి సహా పలు పార్టీల ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంత జిల్లాల్లో గంట ముందుగానే పోలింగ్ ముగియనుంది. జిల్లాలో మొత్తం ఐదు నియోజకవర్గాల్లో 9,66,439 మంది ఓటర్లు ఉన్నారు. 1098 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 320 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. మొత్తం 95 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో, కొత్తగూడెంలో సీపీఐ పోటీలో ఉంది. బీజేపీ, జనసేన కూటమి నేపథ్యంలో బీజేపీ మూడు స్థానాల్లో, జనసేన రెండు స్థానాల్లో పోటీకి దిగింది. ఏ పార్టీ భవితవ్యం ఏంటనేది ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంటుంది. డిసెంబర్ 3న ఇక తెలంగాణను ఏలేది ఏ పార్టీ అనేది తేలిపోతుంది. ఓటర్లు ఎవరిని దీవిస్తారు? ఎవరికి పట్టం కడతారు? అనే అంశంపై ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు రాజకీయ నేతలు. అయితే, అంతకంటే ముందుగానే.. జనం నాడి ఏంటి? ప్రజలు ఎవరి వైపు ఉన్నారు? ఏ పార్టీకి అధికారం కట్టబెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు? అనే అంశాన్ని తేల్చేందుకు అనేక సంస్థలు సర్వేలు నిర్వహించాయి. ప్రజల మూడ్ ఏంటో తెలుసుకున్నాయి. వారు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారో నిర్ధారించాయి.
ఇక ఓటర్ల మీదే భారం అంతా..
68
previous post