60
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయ లబ్ధి కొరకు నాపై నిందలు వేస్తున్నాడని తాడిపత్రి మున్సిపల్ మాజీ చైర్మన్ జాన్సన్ అన్నారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సివిల్ సప్లై స్టాక్ పాయింట్లో నేను అక్రమాలకు పాల్పడుతున్నట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించడం సిగ్గుచేటన్నారు. అవినీతి, అక్రమాలకు ఎవరు పాల్పడుతున్నారో తాడిపత్రి ప్రజలందరికీ తెలుసన్నారు. ఎవరు నిజాయితీపరులో నా దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయని తెలిపారు.