మహిళ పక్షపాతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మహిళలందరూ అండగా నిలవాలని, వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు దబిడి దిబిడే అన్నారు మంత్రి రోజా. తాను చదివిన కాలేజీలోనే ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు మంత్రి ఆర్కేరోజా. కాలేజీలో చదివే రోజులను జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ మురిసిపోయారు. విద్యార్థినులు ఎలాంటి భయాందోళనలకు లోనుకాకుండా ధైర్యంగా ముందడుగు వేసి అనుకున్న రంగంలో రాణించి చరిత్ర సృష్టించాలని రాష్ట్ర మంత్రి పిలుపునిచ్చారు. తిరుపతిలోని టీటీడీకి చెందిన శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పిజి కళాశాలలో వార్షిక పూర్వవిద్యార్థినుల సమ్మేళనం కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థినిలు టీచర్ చెప్పినట్టు చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని, ఎవరెన్ని అడ్డంకు సృష్టించిన , అవమానించిన
ధైర్యంగా లక్ష్యం వైపు వెళ్లాలని సూచించారు. అనుకున్న రంగంలో మనం విజయం సాధిస్తేనే సమాజంలో గౌరవం దక్కుతుందన్నారు.
పూర్వవిద్యార్థినుల సమ్మేళనం – ముఖ్య అతిధిగా మంత్రి
60
previous post