అంబేద్కర్ కోనసీమ జిల్లా(Ambedkar Konaseema District)లో భారీగా అక్రమ మద్యం(Illegal Liquor) పట్టుబడింది. ఐ పోలవరం మండలం పశువులంక గ్రామంలో పోలీసు(Police)లు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రొయ్యల చెరువుల వద్ద 3,072 మద్యం బాటిళ్లు, NDPL అక్రమ మద్యం ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టి వారికి పంచేందుకు అధికార పార్టీకి చెందిన సుంకర నాగబాబు తన రొయ్యల చెరువు వద్ద దాచి ఉంచినట్లుగా సమాచారం అందింది. దీంతో పోలీసులు దాడిచేసి మద్యాన్ని పట్టుకుని స్వధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్ కు తరలించారు. అనంతరం ఎస్ఐ భాను ప్రసాద్ మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ నేపథ్యంలో అక్రమంగా మద్యం, డబ్బులు తరలించినా, నిలువచేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రి మూసివేతపల్నాడు జిల్లాలో కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రిని మూసేశారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని లాలా బజారులో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రానికి కరెంటు బిల్లు కట్టలేదనే సాకుతో మూసీవేశారు.గత వైసీపీ హయాంలో సుమారు…
- ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్ఏపీలో 53 బార్ల వేలం కోసం ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 22 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువుగా నిర్ణయించారు. ఈ నెల 23న దరఖాస్తులను పరిశీలిస్తారు.…
- 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాంఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే పోలవరం మెరుగైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం 2014-19 మధ్య రాత్రింబవళ్లు శ్రమించామని…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.